ధరణి పోర్టల్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అమలు చేసిన రాష్ట్రాలు తేల్చి చెప్పినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అమలు చేస్తున్నారో? అందులో ఉన్న ఆంతర్యమేంటో తెలియట్లేదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రెవెన్యూ ప్రక్షాళన, రిజిస్ట్రేషన్ల మార్పు అంతా గందరగోళంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మా భూమి వెబ్‌సైట్‌కు, ధరణి వెబ్‌సైట్‌కు తేడా ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
భూములు సర్వే చేయకుండా ధరణి పోర్టల్‌లో పెడితే భూముల లెక్కల్లో తేడాలు వస్తే మళ్లీ మార్చాల్సి ఉంటుందన్నారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వచించి ఐదున్నరేళ్లు గడిచినా వాటి వివరాలు ఇప్పటికీ బహిర్గతం చేయలేదని విమర్శించారు. ఆ వివరాలు ప్రజలకు తెలీకుండా జాప్యం చేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సీఎం చేపట్టే ప్రతి కార్యక్రమం వెనుక తన వ్యక్తిగతమైన, స్వార్థపూరితమైన ఎజెండా తప్పక ఉంటుందనే విషయం గతంలో ఎన్నోసార్లు రుజువైందని పేర్కొన్నారు.
ఇదీ చదవండిః ధరణి.. భారతదేశానికే ట్రెండ్ సెట్టర్: సీఎం కేసీఆర్