ఇవీ చూడండి:హస్తాన్ని వీడారు... కమలానికి జై అంటున్నారు
'నా రాజీనామాతోనైనా కనువిప్పు కలగాలి' - CONGRESS
"కాంగ్రెస్‌లో నాయకుల ఎంపికకు డబ్బే ముఖ్యమైంది. ఉగ్రదాడిపై కాంగ్రెస్ నేతలు మాట్లాడిన తీరు చాలా బాధాకరం. మోదీలాంటి బలమైన నాయకత్వం కింద పనిచేయాలనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా. మళ్లీ మోదీనే ప్రధాని అవుతారు."--- పొంగులేటి సుధాకర్‌రెడ్డి
మళ్లీ మోదీనే ప్రధాని...
తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడుతున్నానని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీతో సమావేశమైన పొంగులేటి ఆయన నాయకత్వంలో దేశాభివృద్ధికి కృషిచేస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. దేశ, రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర కలత చెందానని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం డబ్బుకే ప్రాధాన్యమిస్తోందని... తన రాజీనామాతోనైనా అధిష్ఠానానికి కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి:హస్తాన్ని వీడారు... కమలానికి జై అంటున్నారు