ETV Bharat / state

Telangana Decade Celebrations 2023 : ఊరూరా చెరువుల పండగ.. మురిసిన తెలంగాణ - తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు 2023

Ponds Festival In Telangana Decade Celebrations : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ఊరూరా చెరువుల పండగ రాష్ట్రవ్యాప్తంగా సందడిగా సాగింది. మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు.. చెరువుల వద్ద ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. మిషన్‌ కాకతీయ ఆవశ్యకతను.. జల వనరుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు.

Telangana Decade Celebrations
Telangana Decade Celebrations
author img

By

Published : Jun 8, 2023, 7:26 PM IST

Telangana Decade Celebrations 2023 : ఊరూరా చెరువుల పండగ.. మురిసిన తెలంగాణ

Telangana Decade Celebrations 2023 : తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఊరూరా చెరువుల పండగకు విశేష ఆదరణ లభించింది. తెలంగాణలో నాడు ఎండిన చెరువులు.. నేడు నిండుకుండల్ని తలపిస్తున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నమైందన్న ఆయన.. కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులకు పునర్జీవం వచ్చిందని చెప్పారు. మిషన్ కాకతీయ.. దేశానికే ఆదర్శం అయిందన్నారు. ఈ క్రమంలోనే 'అమృత్ సరోవర్'గా మిషన్ కాకతీయ.. దేశవ్యాప్తంగా అమలవుతుందన్న మంత్రి.. 'తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందని' పునరుద్ఘాటించారు.

Telangana Formation Day Decade Celebrations 2023 : హైదరాబాద్ రామంతాపూర్ పెద్ద చెరువు వద్ద నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొనగా.. అంబర్‌పేటలోని మోహిని చెరువు వద్ద సంబురాలకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హాజరయ్యారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని సుర్రం చెరువు వద్ద సంబురాల్లో నీటి పారుదల శాఖ అధికారులు, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. బంజారాహిల్స్ లోటస్ పాండ్​లో నిర్వహించిన చెరువుల పండగ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. మహిళలు తలసానికి బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని తలసాని పేర్కొన్నారు.

అభివృద్ధిని ఓర్చుకోలేకే విమర్శలు..: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తడ్కోల్‌లో జరిగిన ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. జల వనరుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అభివృద్ధిని ఓర్చుకోలేక కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని.. బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో చెరువుల పండగ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ పథకాలను యావత్ రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని కవిత పేర్కొన్నారు.

జాలర్లకు ఆదాయ మార్గాన్ని చూపాం..: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో.. చెరువుల పండగ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంట గ్రామ సమీపంలో చెరువులో చేపలు పడుతున్న జాలర్లతో కలిసి చేపలు పట్టారు. ప్రభుత్వం చెరువులను నింపి, ఉచితంగా చేపలు వేసి.. జాలర్లకు ఆదాయ మార్గాన్ని చూపించిందని మంత్రి తెలిపారు.

తప్పిన ప్రమాదం..: నిజామాబాద్ జిల్లాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి హాజరైన చెరువుల పండుగ కార్యక్రమంలో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. భీంగల్ మండలం పురానిపేట్‌కు ప్రశాంత్ రెడ్డి రాగా.. పార్టీ శ్రేణులు టపాకాయలు పేల్చారు. ఈ క్రమంలో భోజనాల కోసం ఏర్పాటు చేసిన టెంటుపై నిప్పు రవ్వలు పడి.. మంటలు అంటుకున్నాయి. అక్కడున్న వారంతా నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు.

ఇవీ చూడండి..

KTR Today Tweet: 'తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే'

Monsoon Telangana updates : మరో వారంలో తెలంగాణలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు

Adipurush Latest Update : 'ఆదిపురుష్' మూవీ టికెట్లు 10వేలకు పైగా ఫ్రీ.. వారికి మాత్రమే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.