ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిరవధిక దీక్షకు దిగిన కూనంనేని సాంబశివరావు అరెస్టును కార్మిక ఐకాస, సీపీఐ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆయన దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. నిమ్స్‌లో ఉన్న కూనంనేనిని మాజీ ఎంపీ వి.హనుమంతురావు, మోత్కుపల్లి నర్సింహులు, ఆర్.కృష్ణయ్య పరామర్శించారు. అర్ధరాత్రి తర్వాత దీక్ష చేసున్న కూనంనేనిని అక్రమంగా అరెస్ట్ చేశారని వీహెచ్ అన్నారు. అనుమతున్నా లేకున్నా ఈ నెల 30న బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులకు జీతాల్లేకుండా చేసి ముఖ్యమంత్రి మతిలేని రాజ్యమేలుతున్నారని.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని మోత్కుపల్లి నర్సింహులు కోరారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజా జీవితం స్తంభించిపోయిందని ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః 'యూనియన్లు పెట్టుకునే హక్కు ప్రతి కార్మికునికి ఉంది'