Politicians Prefer to Live in Barkatpura : హైదరాబాద్‌లో నానక్‌రాంగూడ అనగానే సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అనగానే వ్యాపారవేత్తలు, సినీనటులు గుర్తుకువస్తారు. అలాగే రాజకీయ నాయకుల నివాసానికి బర్కత్‌పురా నిలయంగా మారింది. రాజకీయ నేతలు సహా పలువురు ప్రజాప్రతినిధుల నివాసాలకు.. తొలి నుంచి నగరంలోని బర్కత్‌పురా పెట్టింది పేరు. నగరం నడిబొడ్డున ఇది ఉండటంతో పాటు.. నాడు భాగ్యనగరం(Hyderabad) అంతగా విస్తరించకపోవడంతో అనేక మంది రాజకీయ నేతలు, వీఐపీలు ఇక్కడే ఉండేవారు. సీఎంల నుంచి మంత్రుల వరకు నివాసం ఏర్పరుచుకున్నారు.
కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సకల సౌకర్యాలు
Telangana Political News : ఇక్కడి విశేషమేమిటంటే.. అసెంబ్లీ, రాష్ట్ర సచివాలయం(Secretariat)కు దగ్గరగా ఉండటం, ప్రశాంత వాతావరణం తోడవడంతో ఎక్కువ మంది నాయకులు తమ నివాసానికి బర్కత్‌పురానే మొగ్గు చూపేవారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులుగా వ్యవహరించిన.. రాంగోపాల్‌రెడ్డి, బాబుల్‌రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు ఈ ప్రాంతంలోనే నివాసముండేవారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి నేటికీ బర్కత్‌పురా హౌసింగ్ బోర్డు కాలనీలోనే ఉంటున్నారు.
ప్రజాకర్షక హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో - ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి - ధరణి స్థానంలో భూమాత పోర్టల్
బూర్గుల మొదలుకుని కిషన్‌రెడ్డి వరకు.. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, దివంగత బూర్గుల రామకృష్ణారావు నివాసం బర్కత్‌పురా చమాన్‌కు దగ్గరలో ఉండేది. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పని చేసిన టి.అంజయ్య కూడా బర్కత్‌పురాలోనే ఉండేవారు. ప్రస్తుతం స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీ పార్కును ఇప్పటికీ అంజయ్య ఉద్యానంగా పిలుస్తుండటం విశేషం. అప్పటి సీఎం ఎన్‌టీఆర్(NTR) హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన మహేంద్రనాథ్, ఉమ్మడి రాష్ట్ర సీఎం ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి కొంతకాలం పాటు బర్కత్‌పురాలోనే నివాసం ఉన్నారు.
Barkatpura Housing Board Colony : తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి కుటుంబం ఇక్కడే నివసిస్తుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి , టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఇక్కడే ఉండేవారని స్థానికులు చెబుతారు. హుడా మాజీ ఛైర్మన్ తుమ్మల ప్రతాప్‌రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌లు బర్కత్‌పురాలోనే నివసిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి 1978 నుంచి బర్కత్‌పురాలోనే నివాసముంటున్నారు.
ఏడు ప్రధాన అంశాలతో బీజేపీ ఇంద్రధనస్సు మేనిఫెస్టో - వారి సంక్షేమంపైనే స్పెషల్ ఫోకస్
హైదరాబాద్ వలస ఓటర్లపై అభ్యర్థుల ఫోకస్ - ఓటు ఎక్కడ వేస్తారో తెలియక టెన్షన్ టెన్షన్