ETV Bharat / state

నాడు తండ్రి చాటు బిడ్డలు - నేడు నాన్నే స్ఫూర్తిగా ఎన్నికల బరిలో దిగిన మహిళా నేతలు - బీఆర్​ఎస్​ అభ్యర్థిగా కంటోన్మెంట్ సాయన్న కూతురు

Politicians Daughters in Telangana Elections : వాళ్లు తండ్రిచాటు బిడ్డలు.. కొందరు అనూహ్యంగా.. మరికొందరు వారసత్వంగా రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నాన్నకు ప్రేమతో అంటూ.. ప్రజా సేవలోకి వచ్చారు. తండ్రుల ఆశయాల సాధనకు ప్రజామోదం పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వివిధ పార్టీల నుంచి ఎన్నికల్లో తలపడుతున్నారు. విజయం కోసం పరిశ్రమిస్తున్నారు. తండ్రుల వారసత్వంతో ఈ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల గురించి ప్రత్యేక కథనం మీ కోసం..

Telangana Elections
Politicians Daughters in Telangana Elections
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 5:00 AM IST

Politicians Daughters in Telangana Elections : హైదరాబాద్​ రాజకీయాల్లో సుధీర్ఘకాలంపాటు ప్రజలకు సేవలందించిన ప్రజా నాయకులు పి.జనార్దన్​రెడ్డి. ఖైరతాబాద్​ నుంచి ఆయన కాంగ్రెస్ తరఫున 1978, 1985, 1989, 1994, 2004లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. 2007లో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వారసుడిగా పి.విష్ణువర్ధన్​ రెడ్డి సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

చివరి వారమంతా తెలంగాణలోనే అగ్రనేతలు - ఆఖరి ఘట్టంలో ప్రచారాన్ని హోరెత్తించనున్న ప్రధాన పార్టీలు

2014 నుంచి పీజేఆర్​ కుమార్తె విజయారెడ్డి నాన్న రాజకీయ వారసత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటగా ఖైరతాబాద్ నుంచి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినా.. గెలుపు వరించలేదు. ఆ తరువాత ఆమె బీఆర్​ఎస్​లో చేరి రెండుసార్లు కార్పొరేటర్​గా గెలిచారు. ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంతో హస్తం గూటికి చేరారు. ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలనేది పీజేఆర్​ ఆశయమని.. ఆయన అడుగుజాడల్లో తాను కూడా నడిచి పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

Cantonment Sayanna Daughter as BRS Candidate : కంటోన్మెంట్​లో పిలిస్తే పలికే నేతగా సాయన్నకు గుర్తింపు ఉంది. 1994 నుంచి మధ్యలో ఒకసారి మినహా 2018 వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆయన 2015 తర్వాత బీఆర్ఎస్​లో చేరారు. అప్పుడే కుమార్తె లాస్యనందితను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఆమె కవాడిగూడ కార్పొరేటర్​గా ఒకసారి గెలిచి.. రెండోసారి ఓడిపోయారు.

విపక్ష పార్టీల సుడిగాలి పర్యటనలు - కుటుంబ పాలనకు అంతం పలకాలంటూ ప్రచారాలు

సాయన్న ఆరునెలల క్రితం అకార మరణం చెందారు. దీంతో బీఆర్​ఎస్​ ఈసారి కంటోన్మెంట్​ టికెట్​ లాస్యనందితకు కేటాయించింది. నాన్న బాటలోనే ఆమె నడుస్తున్నారు.. ప్రజలందర్ని కలుస్తున్నారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో అందరివాడిగా గుర్తింపు పొందిన నాన్నమాదిరే తాను నడవాలని అనుకుంటున్నట్లు లాస్యనందిత చెప్పారు. కంటోన్మెంట్​ నియోజకవర్గంలో సాయన్న మొదలెట్టిన అభివృద్ధి పనులు కొన్ని పూర్తిచేయాల్సినవి ఉన్నాయని.. వాటిని పూర్తి చేయడమే తన లక్ష్యమని నందిత అన్నారు.

మల్కాజిగిరి నియోజకవర్గంపై ప్రధాన పార్టీల ఫోకస్ - ఎవరికీ రెండో ఛాన్స్ ఇవ్వని ప్రజలు - ఈసారి గెలుపు ఎవరిదో?

Gaddar's daughter as Congress candidate : ప్రజల్ని తన పాటలతో మేల్కొలిపిన ప్రజాగాయకుడు గద్దర్‌.. తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తన గళంతో లక్షలాది గొంతుకల్ని ఏకం చేశారు. చాలా ఏళ్లపాటు బ్యాలెట్‌ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తీరా పోటీ చేద్దామనుకునే సమయంలో ఆయనే దూరం అయ్యారు. గద్దర్‌ అకాలమరణంతో ఆయన కూతురు డాక్టర్‌ వెన్నెలకు కాంగ్రెస్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్‌ ఇచ్చింది. సమాజం కోసం తండ్రి తపించిన తీరుగానే తానూ నడుస్తానంటూ ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారని.. తన గెలుపు ఖాయమని వెన్నెల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

గెలుపే లక్ష్యంగా తాయిలాల పంపిణీపై అభ్యర్థుల ఫోకస్ - ఓటర్లు కోరినవీ కోరనివి అన్నీ ఇచ్చేస్తున్నారుగా

ఎన్నికల వేళ పార్టీ మారుతున్న నాయకులు - సందిగ్ధంలో అనుచరులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.