ETV Bharat / state

Political Parties Focus on Hyderabad Election Plans : నగర ఓటరు మనసు గెలిస్తేనే.. తెలంగాణ అధికార పీఠం దక్కేది - హైదరాబాద్‌లో సమస్యలు

Political Parties Focus on Hyderabad Election Plans : హైదరాబాద్​లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలో అధికార పీఠంపై కూర్చోవాలంటే అత్యధిక సీట్లు ఉన్న భాగ్యనగరంలో ఓటర్ల మనసు గెల్చుకోవాల్సిందే. అందుకే పార్టీలు ప్రత్యేకించి నగర ఎన్నికల ప్రణాళికలపై ఫోకస్ పెట్టాయి. రాష్ట్ర జనాభాలో మూడో వంతు జనం ఇక్కడే ఉంటున్నారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే నగర అవసరాలు భిన్నంగా ఉంటాయి. గ్రేటర్​లో ఎన్నో సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాటి పరిష్కారానికి పార్టీల ఎన్నికల ప్రణాళికలలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు, సామాజిక సమస్యల పరిష్కారం దిశగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు.

Political Parties Focus on Hyderabad Election Plans
Telangana Political Parties
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2023, 12:12 PM IST

Political Parties Focus on Hyderabad Election Plans : హైదరాబాద్ నగరం​లో కోటి మందికి పైగా నివసిస్తున్నారు. ఈ సంఖ్య ఏటా పెరుగుతూ పొతోంది. భాగ్యనగరంలో కొన్ని సమస్యలు ఏళ్ల తరబడి పట్టి పీడిస్తున్నాయి. వాటి పరిష్కారానికి ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాల హయాంలో ప్రయత్నాలు జరిగినప్పటికీ.. తాత్కాలిక ఉపశమనం తప్ప చాలావాటికి శాశ్వత పరిష్కారాలు కలగలేదు. రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వచ్చేది హైదరాబాద్​ నుంచే కాబట్టి కేటాయింపులోనూ ప్రాధాన్యత ఇచ్చి.. సమస్యల పరిష్కార హామీలకూ ఎన్నికల ప్రణాళిక(Election Planning)లో చోటు కల్పించాలని నగరవాసులు కోరుతున్నారు.

  • రోడ్లు విస్తరిస్తున్నా.. పైవంతెనలు నిర్మిస్తున్నా.. కొత్త ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు(Traffic Problems) పుట్టుకొస్తున్నాయి. అభివృద్ధి చెందిన నగరాల్లో పరిష్కారంగా ప్రజారవాణాను విస్తరిస్తున్నారు. భాగ్యనగరంలో ప్రజారవాణా 31 శాతం మాత్రమే. అయితే ఇది 50 శాతానికి పెరగాల్సి ఉంది. దీనికి గాను బస్సుల సంఖ్య పెంచాలి. ఎంఎంటీఎస్‌(MMTS), మెట్రో మార్గాలను విస్తరించాలి. పార్టీలు వీటి గురించి ఆలోచించి.. స్పష్టంగా విధానాలను ప్రకటించాలి.
  • వర్షాకాలం వస్తే చాలు.. రోడ్లు, కాలనీలు నీట మునుగుతున్నాయి. ముఖ్వంగా వరద కాలువల విస్తరణ, కొత్తవాటి నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చెరువుల ఆక్రమణలు నివారించి.. వరద వాటిలోకి వెళ్లేలా చూడాలి.

Central Election Commission Telangana Tour : ప్రలోభాల అడ్డుకట్టతోనే పారదర్శకంగా ఎన్నికలు.. అధికారులకు ఈసీ కీలక ఆదేశాలు

హైదరాబాద్​లో ఉన్న సమస్యలు :

  • ఎక్కడ చూసినా.. బస్తీల్లో, పాత కాలనీల్లో ఇళ్ల మీదుగా విద్యుత్ తీగలు(Electrical Wires) వేలాడుతున్నాయి. ప్రతి సంవత్సరం వీటి వల్ల ఎంతో మంది చిన్నారులు, పెద్దలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే వీటి తొలగింపునకు గతంలో రూ.550 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా కూడా వేశారు.
  • విద్యాసంస్థల్లో ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అవి హేతుబద్ధంగా ఉండేలా కార్యాచరణ ప్రకటించాలి. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడంతో పాటు వాటిని విస్తరించాలి.
  • వాహన, పారిశ్రామిక, ప్లాస్టిక్‌ కాలుష్యం(Plastic Pollution) పెరుగుతోంది. చాలా చోట్ల చెరువులు మురుగుతో కలుషితం అవుతున్నాయి. వాటి నివారణ చర్యలపై విధానాలు ప్రకటించాలి.
  • పాదబాటల నిర్మాణంతో పాటు ఆక్రమణలు నిరోధించాలి. రోడ్లపై నడుస్తూ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి నివారణకు ఈ పార్టీలు నిబద్ధత ప్రకటించాలి.
  • సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటు ధరల్లో హౌసింగ్‌ ప్రాజెక్టులు(Housing Projects) చేపట్టేందుకు విధానాలు రూపొందించాలి.
  • ప్రతి కుటుంబానికి రూ.పది లక్షల వరకు ఆరోగ్య బీమా(Health Insurance) ఉండాలి. ప్రీమియం భారం కాకుండా ప్రభుత్వం తోడ్పాటు అందించేలా చూడాలి.

సకాలంలో నిధుల కేటాయింపు : స్థానిక సంస్థలకు ప్రభుత్వం స్వయంప్రతిపత్తి కల్పించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి అన్నారు. ఫైనాన్స్‌ కమిషన్‌ సూచించిన మేరకు నిధుల కేటాయింపు జరగాలని తెలిపారు. హైదరాబాద్‌ వరకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఉన్నారని పేర్కొన్నారు. చిన్న కార్యక్రమాలనూ మంత్రులు ప్రారంభించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఆ అవకాశం గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజాప్రతినిధులకు కల్పించాలని సూచించారు. గ్రేటర్‌కు సకాలంలో నిధుల కేటాయింపు వరకు సర్కారు మద్దతు ఉండాలని కోరారు. అత్యధిక ఆదాయం ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి కేటాయింపులు అదే స్థాయిలో ఉండాలన్నారు. నిధులు లేక చాలా పనులు ఆగిపోవడం చూస్తున్నామని పేర్కొన్నారు. వీటిపై ఎన్నికల ప్రణాళికల్లో ఆయా పార్టీలు కచ్చితమైన అభిప్రాయాలు వెల్లడించాలని ఆయన కోరారు.

KTR on Hyderabad Development : 'హైదరాబాద్‌పై చిన్న మచ్చ పడినా.. అందరికీ ఇబ్బంది కలుగుతుంది'

Telangana BJP Election Campaign : అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కమలం వ్యూహాలు.. రూట్‌ మ్యాప్‌ సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.