ETV Bharat / state

ఓటరన్నా ఈసారి నీ ఓటు రేటెంతా - నీ లీడర్ ఇచ్చే చీప్​లిక్కర్ రేటంతేనా? - Telangana Assembly Election campaign

Political Leaders Gifts Distribution in Telangana : పోలింగ్‌కు మరో మూడు రోజులే ఉండటంతో ఓటర్లను ఎలాగైనా తమవైపు తిప్పుకోవాలని అన్ని పార్టీలు ప్రలోభాలకు తెరతీశాయి. సభలో ఎక్కువ మంది జనాలను చూపించుకోవడం కోసం గ్రామాల నుంచి భారీగా ప్రజలను వాహనాలలో తీసుకొస్తున్నారు. సభల్లో పాల్గొన్న ప్రజలకు చికెన్, మటన్ బిర్యానీలతో భోజనాలను వడ్డిస్తున్నారు. సభకు వచ్చిన ఒక్కొక్కరికి దూరాన్ని బట్టి రూ.300 నుంచి రూ.500 వరకు చెల్లిస్తున్నారు.

Telangana Assembly Election 2023
Political Leaders Gifts Distribution in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 2:40 PM IST

Political Leaders Gifts Distribution in Telangana : పోలింగ్‌కు మరో మూడు రోజులే సమయం ఉండటంతో ఓటర్లను ఎలాగైనా తమవైపు తిప్పుకోవాలని అన్ని పార్టీలు ప్రలోభాలకు తెరతీశాయి. కొన్ని నియోజకవర్గాల్లో 30 నుంచి 40 కోట్లు పంచడం పూర్తయినట్లు సమాచారం. ఇకపోతే సభలు, ప్రచారానికి జనం తరలింపు, వాహనాల ఖర్చులు, పోలింగ్‌కు ముందు ఓటర్లకు ప్రత్యేకంగా పంచేవి వీటికి అదనం. బరిలో దిగిన అభ్యర్థులు ఏ గ్రామంలో అడుగు పెడితే అక్కడ తమ మార్కును చూపిస్తున్నారు. సభలు ప్రారంభం కావడానికి ముందే చికెన్, మటన్ బిర్యానీలతో భోజనాలను వడ్డిస్తున్నారు. కడుపునిండా తినాలని నాయకులే దగ్గరుండి వడ్డిస్తున్నారు. సభలు ప్రారంభం కాగానే అభ్యర్థులు తమ పార్టీ గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు. తను గెలిచాక గ్రామాలలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీలిస్తున్నారు.

Telangana Assembly Election 2023 : పరిగి, కొడంగల్‌, వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాలలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ, జనసేన, బీఎస్పీలు హోరా హోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. అగ్రనాయకులతో రోడ్ షోలు సభలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ పోటీ ఎక్కువగా ఉంది. ఎవరికివారు గెలవాలనే పట్టుదలతో నియోజకవర్గ కేంద్రాల్లో సామాజిక వర్గాల వారిగా వేడుక మందిరాల్లో ఆత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహిస్తున్నారు. గ్రామాల నుంచి పార్టీ నాయకులు వాహనాల్లో వేల మందిని తరలిస్తున్నారు.

యువతకు ఉద్యోగాల విషయంలో హామీలిస్తూ.. వారికి కావలసిన ఆట వస్తువులను ఇచ్చి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. మహిళలకు పట్టు చీర.. కుక్కర్లు, ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్లు, స్టౌలు అందజేస్తున్నారు. మరోవైపు ఆలయాలకు ఫండ్‌గా రూ.2 లక్షలకు పైగా.. కుల దేవతలు ఆలయాల పునర్నిర్మాణానికి రూ.5 లక్షలు సమర్పిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల దాకా ప్రచారం చేసినందుకు ప్రధాన పార్టీల నేతలు రోజుకు ఒక్కో గ్రామానికి రూ.10వేలను ప్రచార ఖర్చుల కింద చెల్లిస్తున్నారు.

ఆ గట్టునున్నావా ఓటరన్నా ఈ గట్టునున్నావా - ప్రజానాడి తెలియక అభ్యర్థుల పరేషాన్

దూరాన్నిబట్టి రూ.300- రూ.500 : సభ ముగియగానే మనోళ్లను మంచిగ చూసుకోవాలని కోరుతూ ప్రజలను తరలించిన నాయకులకు పెద్దమొత్తంగా డబ్బులు అందజేస్తున్నారు. వారు తమకు అందిన డబ్బును సభకు వచ్చిన ఒక్కొక్కరికి దూరాన్ని బట్టి రూ.300 నుంచి రూ.500 వరకు ఇస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే. అన్ని పార్టీల అభ్యర్థులు దీన్ని పాటిస్తుండడంతో దీనిపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోక పోవడం విశేషం. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో రోజువారీ ఉపాధి పనుల కోసం వెళ్లేవారు అవి మానేసి ఎన్నికలలో తిరుగుతున్నారు. వారికి ఎన్నికల ప్రచారం మంచి ఆదాయ వనరుగా మారింది. దీంతో ఆయా పార్టీల సభలో ఎక్కువ మంది జనం కనిపించాలన్నా.. ప్రత్యర్థి పార్టీ ప్రచారానికి జోరు కనిపించాలన్నా తాయిలాలు ఇవ్వాల్సిందే..

రోజంతా కష్టపడి పని చేసే అడ్డా కూలీలు ప్రస్తుతం నిలిచిపోవడంతో.. కూలీలు ఏ పార్టీ వారు పిలిస్తే వారి తరుపున జెండాలు పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వికారాబాద్‌ నియోజక వర్గంలోని గ్రామాల నుంచి నిత్యం 2 వేల మంది వరకు కూలీలు రోజు పని కోసం వికారాబాద్‌ పట్టణానికి వస్తుంటారు. వీరిలో సగానికి పైగా ప్రస్తుత ఎన్నికల్లో రోజూ ఉపాధి పొందుతున్నారు. ప్రచారంలో పాల్గొంటే ఒక్కో కూలీకి భోజనం పెట్టి రూ.వెయ్యి వరకు కూడా ఇస్తున్నారు.

రాష్ట్రంలో ల్యాండ్‌, సాండ్‌, వైన్స్‌ మాఫియా పెరిగింది - అవినీతి పాలనతో తెలంగాణ నష్టపోయింది : రాహుల్​ గాంధీ

ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.