Political Leaders Free Gifts Distribution : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలన్నీ సంసిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీలు త్వరలోనే ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. రేపో మాపో ఎన్నికల నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖరారైన పలువురు అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలెట్టేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ఇంకాస్త సమయం ఉండటంతో ఆశావహులు, నేతలు ముందుగానే తాయిలాలు పంపిణీని ప్రారంభించారు. షెడ్యూల్ తర్వాత కోడ్ అమల్లోకి వచ్చాక.. ఏదైనా పంపిణీ చేయాలంటే అధికారులు, పోలీసుల నిఘా ఉంటుంది. ప్రత్యర్థి నేతలూ అల్లరల్లరి చేసేస్తారు. ఎలక్షన్ కమిషన్ కొరడా ఝుళిపిస్తుంది.
Ujjwala Yojana Free Gas Cylinder : కేంద్రం శుభవార్త.. ఉచితంగా మరో 75 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు
Telangana Assembly Elections 2023 : ఈ అన్ని బాధలు లేకుండా ఎలక్షన్ కోడ్ రాకముందే పలు జిల్లాల్లో కొంతమంది నాయకులు ఉచితాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. చీరలు, కుట్టు మిషన్లు, గడియారాలు, కుక్కర్లు దర్జాగా పంపిణీ చేస్తూ.. ఈ ఎన్నికల్లో తమకే ఓటు వేసి గెలిపించాలని మాట తీసుకుంటున్నారు. స్థానికంగా ఎంతోకొంత ప్రభావం చూపేవారికి మరింత వ్యక్తిగత లబ్ధి చేకూర్చేందుకూ వెనకాడటం లేదు. ఇంకొన్ని చోట్ల ఆయా పార్టీలు చేపట్టే సర్వేల్లో.. తమకు సానుకూలమైన నివేదిక వచ్చేలా కొందరు నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బస్తీలు, కాలనీలు, పెద్ద పెద్ద గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి.. తమ గ్రాఫ్ పెంచుకునే కార్యక్రమాలు చేపడుతున్నారు.
రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు.. కిలోకు రూ.34 ఇస్తామన్న ప్రభుత్వం
వెలుగులోకి వచ్చిన కొన్ని..
- దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని మంచిర్యాల జిల్లాలో ఓ నేత చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ నాయకుడు ఇంటింటికీ గోడ గడియారాలు పంపిణీ చేసి.. తనకే ఓటు వేయాలంటూ మాట తీసుకున్నాడు.
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజుల క్రితం ఓ నేత మహిళలకు కుక్కర్లు పంపిణీ చేశారు.
- ఉమ్మడి పాలమూరు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలువురు నాయకులు మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ ప్రారంభించారు. ఛారిటబుల్ ట్రస్టుల ద్వారా ఒకరిద్దరు నేతలు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుండగా.. కొందరు మాత్రం ఇటీవలే మొదలుపెట్టారు.
- కొన్ని నియోజకవర్గాల్లో ఇటీవల పలువురు నేతలు డ్రైవింగ్ లెసెన్స్‌లు ఇప్పించేందుకు పోటాపోటీగా క్యాంపులు నిర్వహించారు.
- వినాయక చందాలు ఇవ్వడం ప్రతి ఏటా మామూలే. అయితే ఈ సంవత్సరం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ పరిధిలో కొందరు నేతలు పెద్దఎత్తున చందాలు ఇచ్చారు. విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతం పేరు, ఆ కమిటీ పూర్తి సమాచారం తీసుకుని చందాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
మహిళలే లక్ష్యం.. అయితే.. కొన్నిపార్టీల నేతలు చేపట్టిన ఉచితాల పంపిణీ మహిళలే లక్ష్యంగా కొనసాగుతోంది. ఏదేమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలన్నీ సానుకూలతను పెంచుకునే వాటిగానే చూడాల్సి ఉంటుందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
'ఫ్రీ బస్' పథకంతో ప్రభుత్వంపై పెను భారం.. ఒక్క రోజు బిల్ ఎంతో తెలుసా?