సంచలనం సృష్టించిన దిశ ఘటన అనంతరం మహిళ భద్రతే ప్రశ్నార్థకమైందని పోలీసు శాఖపై విమర్శలొచ్చాయి. జాతీయ రహదారి పక్కనే, టోల్బూత్ సమీపంలో... 24 గంటలపాటు వాహనాల రాకపోకలు కొనసాగే ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నా.. కనీసం ఎవరూ గమనించకపోవడం సమాజాన్ని విస్తుపోయేలా చేసింది.
అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆపదలో ఉన్న మహిళలు వెంటనే పోలీసులను సంప్రదించేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే డయల్ 100 నెంబర్ అందుబాటులో ఉంది. దీనిపై మరింత విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నారు. పోలీస్ శాఖ తరఫున కానిస్టేబుళ్లు.. విద్యా సంస్థలు, జనసమర్థ ప్రాంతాల వద్దకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద కటౌట్లు, హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు.
ఐదేళ్లుగా హైదరాబాద్ మహానగర పరిధిలో హాక్-ఐ మొబైల్ అప్లికేషన్ అందుబాటులో ఉంది. ఆపదలో ఉన్న మహిళలు హాక్-ఐ అప్లికేషన్లోకి వెళ్లి అత్యవసర బటన్ నొక్కితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అప్రమత్త సందేశం వెళ్లే విధంగా దీనిని రూపొందించారు. దీంతో సదరు మహిళను ఆపద నుంచి రక్షించే విధంగా రూపకల్పన చేశారు. ఇది అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి.. సుమారు 13లక్షల మంది వినియోగదారులు చరవాణుల్లో డౌన్లోడ్ చేసుకోగా... దిశ ఘటన అనంతరం నెలరోజుల వ్యవధిలోనే సుమారు 2లక్షల మంది యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు.
ఇవీ చూడండి: 'విద్యార్థుల్లో దాగున్న నైపుణ్యం వెలికితీయాలి'