పేరడీ పాటతో కరోనాపై అవగాహన కల్పిస్తున్న పోలీస్ - latest news on Police to educate Corona with parody song
నీలి నీలి అంబర్‌పర్.. చాంద్ జబ్ అయే.. ప్యార్ పర్ బర్సాయే.. హంకో తరసాయే.. అనే హిందీ పాటను పేరడీగా మార్చి నేరేడ్మెట్ సీఐ నరసింహస్వామి కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. దీనికోసం స్వయంగా పాట పాడి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటున్నారని.. అందుకే పాటను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు సీఐ తెలిపారు. విధులు నిర్వర్తించడంతో పాటు సామాజిక బాధ్యతగా పాట రూపంలో ప్రజలకు అవగాహన కల్పించడం పట్ల సీఐకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.