ETV Bharat / state

ఇక్కడే ఉండండి: వలస కార్మికులకు పోలీసుల హితవు..! - police on migrant labours

కరోనా వైరస్‌ విజృంభణతో నిర్మాణ పనులు అరకొరగా సాగుతుండటంతో సొంత రాష్ట్రాలకు పయనమయ్యేందుకు వలస కార్మికులు రైల్వేస్టేషన్లకు బారులు తీరుతున్నారు. రిజర్వేషన్‌ దొరికినా.. దొరక్కపోయినా స్టేషన్లకు చేరుకుంటే చాలు.. అక్కడే టిక్కెట్‌ దొరకబుచ్చుకొని వెళదామన్న ఉద్దేశంతో ఆవరణలోనే ఉండిపోతున్నారు. అలాంటి వారికి పోలీసులు ఇక్కడే ఉండాలంటూ హితవు పలుకుతున్నారు. తమ తమ రాష్ట్రాల కంటే తెలంగాణలోనే పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు.

వలస కార్మికులకు పోలీసుల హితవు
వలస కార్మికులకు పోలీసుల హితవు
author img

By

Published : May 20, 2021, 9:53 AM IST

కరోనా కట్టడికి ప్రభుత్వం రాష్ట్రంలో రెండో విడత లాక్‌డౌన్‌ విధించింది. ఫలితంగా పనులు దొరక్క చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వలస కార్మికులు తమ తమ రాష్ట్రాలకు పయనమవుతున్నారు. లాక్​డౌన్​ మొదలైన వారం రోజుల్లోనే పది వేల మందికి పైగా వివిధ మార్గాల్లో తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లోనూ మహమ్మారి ప్రభావం తీవ్రంగానే ఉండడంతో మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో పనులు చేస్తున్న 1.20 లక్షల మంది వలస కార్మికులను ఇక్కడే ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. అక్కడి కంటే ఇక్కడే పరిస్థితి నయంగా ఉందని చెబుతున్నారు.
లాక్‌డౌన్‌ పొడిగింపుతో..
ఇప్పటికే కొన్నిచోట్ల పనులు ఆగిపోయాయ్‌. తాజాగా లాక్‌డౌన్‌ పొడిగించారు. ఇంకెన్ని రోజులు ఈ పరిస్థితి ఉంటుందో స్పష్టత లేదు. అందుకే స్వగ్రామాలకు వెళ్లాలని వలస కార్మికులు భావిస్తున్నారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న తమ గ్రామస్థులు, బంధువులకు ఫోన్లు చేసి కలిసి వెళ్దామని పురమాయిస్తున్నారు. పట్నా వెళ్లే దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కు తోడు మరో రెండు ప్రత్యేక రైళ్లు వేశారని తెలుసుకొని ప్రయాణానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కార్మిక, ఇతర శాఖల అధికారులతో సంప్రదింపులు జరిపి పనులు కొనసాగేందుకు మేం అనుమతులు ఇస్తాం.. గుత్తేదారులకు, భవననిర్మాణ సంస్థల ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేయాలంటూ తెలిపారు.
వసతి, ఆహారం కల్పించి..
నగరంలోని వలస కార్మికులకు వసతి, ఆహారం సక్రమంగా అందేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కూకట్‌పల్లి, మియాపూర్‌, చందానగర్‌ ఉప్పల్‌, మల్కాజిగిరి, అల్వాల్‌ ప్రాంతాల్లో వారి పరిస్థితులపై వాకబు చేశారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా రాష్ట్రాల అధికారులతో మాట్లాడిన నగర పోలీసులు, కార్మిక శాఖ అధికారులు అక్కడ కరోనా వైరస్‌ ప్రభావాన్ని తెలుసుకున్నారు. ఉద్ధృతి తీవ్రంగా ఉందని, ఇక్కడే సురక్షితంగా ఉంటారంటూ వలస కార్మికులకు వివరిస్తున్నారు.

ఇదీ చూడండి: కొవాగ్జిన్‌ కోసం లక్షల మంది ఎదురు చూపులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.