Police Stops Ayyappa Padipuja: ముందస్తు అనుమతి తీసుకోలేదన్న కారణంతో.. అయ్యప్ప పడిపూజను పోలీసులు అడ్డుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది. భీమవరం మండలం సుంకర పెద్దయ్య వీధికి చెందిన కొందరు అయ్యప్ప మాలధారులు.. శనివారం రాత్రి అయ్యప్ప పడిపూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
చివరి నిమిషంలో పడిపూజకు అనుమతి లేదంటూ పోలీసులు, మున్సిపల్ అధికారులు వారిని అడ్డుకున్నారు. అయ్యప్ప మాలధారులు ఎంత వేడుకున్నా పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, అయ్యప్ప మాలధారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా, అయ్యప్ప మాలధారులు.. వీధుల్లో భజనలు, కీర్తనలు చేస్తూ భీమవరం బస్టాండ్ వద్దకు చేరుకునిరోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: