గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎప్పటికప్పుడు మొరాయించడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. వాహనం ఎక్కడబడితే అక్కడే ఆగిపోతోందని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి ఇచ్చేందుకు ప్రగతిభవన్ వద్దకు వెళ్లిన రాజాసింగ్‌ను పంజాగుట్ట పోలీసులు అడ్డుకున్నారు.
అసెంబ్లీ నడుస్తున్న సమయంలో ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో ఆయనను పోలీసులు అసెంబ్లీకి తరలించారు. ఆ తరువాత ప్రధాన గేట్ వద్ద నుంచి రాజాసింగ్ నడుచుకుంటూ అసెంబ్లీలోకి వెళ్లారు.
ఎప్పటికప్పుడే మొరాయిస్తున్న వాహనం: నిన్న అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుంటే వాహనం ముందు చక్రం ఊడిపోయిందని రాజాసింగ్ పేర్కొన్నారు. బండి వేగంగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తనకు ఇచ్చిన వాహనాన్ని మార్చాలని.. లేదంటే మీ వాహనం మీరు తీసుకోండి అంటూ పరుషపదజాలంతో వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: