ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని కమిషనరేట్లలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి మత్తు దందాపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే 3 కమిషనరేట్ల పరిధిలో రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదగా అరటిపండ్ల మాటున గంజాయి రవాణాచేస్తున్న ముఠాను ఎల్బీనగర్, ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఆముఠాలో ఇద్దరు పట్టుబడగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 18న్నర లక్షల విలువైన గంజాయితోపాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గత అయిదేళ్లలో రాచకొండ కమిషనరేట్‌లో 7వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా 160 కేసులు నమోదయ్యాయి. 66 మందిపై పీడీ చట్టాన్ని ప్రయోగించారు.
హైదరాబాద్ బాలానగర్‌లో గంజాయి నూనె విక్రయిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టుచేశారు. కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద 4 డబ్బాల గంజాయి నూనెను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దుండిగల్‌లోని గండిమైసమ్మ చౌరస్తాలో గంజాయి నూనె సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఏవోబీ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న వంద కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం బెహరాన్‌గూడలో గంజాయి తోటను ధ్వంసం చేసిన ఎక్సైజ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు వాటి వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. హైదరాబాద్‌లో 'మరో లోకం' పేరిట అమృత ఫౌండేషన్ సంస్థ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగహన కలిగిస్తోంది.
ఇదీ చూడండి: