NARA LOKESH VEHICLE SEIZED : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్‌లోని ప్రచార రథాన్ని పోలీసులు సీజ్ చేశారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో లోకేశ్ పర్యటిస్తున్నారు. పట్టణంలో పాదయాత్ర కొనసాగుతుండగా ఓ చోట ప్రజలను ఉద్దేశించి ప్రచార రథం పైకి ఎక్కి ఆయన మాట్లాడారు. లోకేశ్ మాట్లాడి కిందికి దిగిన తర్వాత ఆ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.
పాదయాత్రలో మైక్‌కు అనుమతి లేదని.. అందుకే సీజ్ చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత ప్రచార రథాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై తెదేపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరును నిరసిస్తూ లోకేశ్ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఏ రాజ్యాంగం, ఏం చట్టం ప్రకారం వాహనాన్ని సీజ్ చేశారని ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పారు. లోకేశ్, టీడీపీ నేతల నిరసన తర్వాత పోలీసులు ప్రచార రథాన్ని విడిచిపెట్టడంతో ఆయన తిరిగి తన పాదయాత్రను కొనసాగించారు.
ఇవీ చదవండి: