ETV Bharat / state

శ్రీనివాస్​గౌడ్​ హత్యకు కుట్ర కేసు.. రిమాండ్​ రిపోర్టులో ఆసక్తికర విషయాలు - minister srinivas goud latest news

Remand Report on Minister Murder Conspiracy case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసుకు సంబంధించి రిమాండ్​ రిపోర్టులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. కౌన్సిలర్ టికెట్ రాకుండా అడ్డుకున్నాడని మంత్రిపై మున్నూరు రవి కక్ష పెంచుకున్నాడని.. వ్యాపారపరంగా నష్టం చేకూర్చాడని కక్షతో ఉన్న రాఘవేందర్ రాజు, నాగరాజు మంత్రి హత్యకు కుట్ర పన్నారని పోలీసులు రిమాండ్​ రిపోర్టులో వెల్లడించారు.

శ్రీనివాస్​గౌడ్​ హత్య కుట్ర కేసు.. రిమాండ్​ రిపోర్టులో ఆసక్తికర విషయాలు

author img

By

Published : Mar 4, 2022, 12:25 PM IST

Updated : Mar 4, 2022, 5:25 PM IST

Remand Report on Minister Murder Conspiracy case: మంత్రి శ్రీనివాస్​ గౌడ్ హత్యకు కుట్ర కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​తో పాటు అతడి అనుచరుడు హైదర్ అలీని అమరేందర్ రాజు సోదరులు హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఫరూఖ్​ను సంప్రదించటం..

మంత్రిని హత్య చేయడం కోసం తుపాకులు సమకూర్చుకోవడానికి శంషాబాద్​కు చెందిన ఫరూఖ్​ను అమరేందర్​ రాజు సోదరులు సంప్రదించారు. గతేడాది నవంబర్ 18న ఫరూఖ్ ఓ ఎక్సైజ్ కేసులో భాగంగా మహబూబ్​నగర్ కోర్టుకు వచ్చాడు. అమరేందర్ రాజు చిన్న సోదరుడు నాగరాజు.. ఫరూఖ్​ను కలిసి తుపాకుల గురించి అడిగాడు. హైదర్​తో పాటు అతడి రాజకీయ గురువు శ్రీనివాస్​గౌడ్​ను హత్య చేయడానికి తుపాకులు ఇప్పించాల్సిందిగా కోరారు. ఫరూఖ్ ఈ విషయాన్ని హైదర్ అలీకి తెలిపాడు.

అందరినీ అరెస్ట్​ చేయటం..

కుట్ర విషయాన్ని బయటపెట్టిన ఫరూఖ్​తో పాటు హైదర్ అలీని చంపేందుకు నాగరాజు, విశ్వనాథ్, యాదయ్య ప్రయత్నించి పేట్​బషీరాబాద్ పోలీసులకు దొరికిపోయారు. గత నెల 27నే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. అసలు విషయం బయటపడటంతో.. పరారీలో ఉన్న రాఘవేందర్ రాజు, మధుసూదన్ రాజు, మున్నూరు రవి.. దిల్లీలోని జితేందర్ రెడ్డికి చెందిన అతిథి గృహంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి ముగ్గురిని అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరుపర్చి హైదరాబాద్ తీసుకొచ్చారు. మైలార్​దేవ్ పల్లిలోని ప్రగతినగర్​లో ఉన్న అమరేందర్ రాజును అరెస్ట్ చేశారు.

హత్యకు కుట్ర ఎందుకంటే..?

కొన్నేళ్లుగా అమరేందర్ రాజు మహబూబ్​నగర్ పట్టణంలో రాజకీయంగా పేరు సంపాదించుకున్నాడు. మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అమరేందర్ సోదరులైన మధుసూదన్, రాఘవేందర్ రాజు, నాగరాజు పలు వ్యాపారాలు చేస్తున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజకీయ ప్రవేశంతో... అమరేందర్ రాజు క్రమంగా ప్రాభవం కోల్పోతూ వచ్చాడు. ఆర్థికంగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడని రాఘవేందర్ రాజు పోలీసులకు తెలిపాడు. ఐదేళ్లుగా ఇబ్బందులు పడుతుండటంతో అమరేందర్ రాజు ప్రోద్బలంతో రాఘవేందర్ రాజు హత్యకు కుట్రపన్నాడు. మున్నూరు రవి మహబూబ్​నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్ ఆశించి భంగపడ్డాడు. రవి కూడా రాఘవేందర్ రాజుకు జత కలిశారు. రాఘవేందర్ రాజు స్నేహితులైన యాదయ్య, విశ్వనాథ్​ కూడా కుట్రలో భాగస్వాములయ్యారు.

అడవుల్లో తుపాకులు..

రాఘవేందర్ రాజు, మున్నూరు రవి రెండు తుపాకులను కొనుగోలు చేశారు. వాటిని ఎక్కడ తెచ్చిన విషయాన్ని పోలీసులకు చెప్పలేదు. రెండు తుపాకులతో పాటు బుల్లెట్లను బౌరంపేట అడవుల్లో దాచిపెట్టారు. ఇద్దరినీ అరెస్ట్ చేసిన తర్వాత అడవుల్లో దాచిపెట్టిన రెండు తుపాకులను, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Mar 4, 2022, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.