ETV Bharat / state

అయ్యప్పస్వామిపై ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు.. పోలీసుల రిమాండ్ రిపోర్ట్​ - Remand report on Bairi Naresh Case

Remand report on Bairi Naresh Case:అయ్యప్పస్వామిపై ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేసినట్టు బైరి నరేశ్​ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడుపై గతంలోనూ కేసులు ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు కొడంగల్ పోలీసులు రిమాండ్​ రిపోర్ట్​ను కోర్టుకు సమర్పించారు.

Bairi Naresh
Bairi Naresh
author img

By

Published : Jan 2, 2023, 4:25 PM IST

Updated : Jan 2, 2023, 4:55 PM IST

Remand report on Bairi Naresh Case: అయ్యప్పస్వామిపై బైరి నరేశ్ ఉద్దేశపూర్వకంగానే వివాదస్పద వ్యాఖ్యలు చేశాడని.. విచారణలో ఒప్పుకున్నట్లు కొడంగల్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్​లో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం బైరి నరేశ్​తోపాటు హనుమంతును అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టర్‌లో కీలక అంశాలను పొందుపరిచారు. ఈ కేసులో ఏ2 గా ఉన్న హనుమంతు కొండంగల్‌లో అంబేడ్కర్​ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడని తెలిపారు.

ఇందు కోసం బైరి నరేశ్​ను అహ్వానించగా.. అతను హజరయ్యాడని పోలీసులు అన్నారు. ఈ క్రమంలోనే అయ్యప్పస్వామిపై.. బైరి నరేశ్​ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యామాల్లో వైరల్​ కావడంతో ఉమాపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించామని అన్నారు. నరేశ్​పై గతంలో వికారాబాద్ జిల్లా నవాబుపేటలో ఒక కేసు, హనుమకొండ జమ్మికుంటలో రెండు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడు నరేశ్​ను కస్టడీకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసులు రిమాండ్​ రిపోర్ట్​లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి: అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ అరెస్ట్​.. 20 రోజుల రిమాండ్​

సిర్పూర్కర్ నివేదికను త్వరగా అమలు చేయాలి: హైకోర్టు

ఆకాశ్ అంబానీ ఫేక్​ ఐడీతో ఆమెకు వల.. రూ.25 లక్షలు కాజేసి, న్యూడ్ ఫొటోస్​తో బెదిరించి..

Last Updated : Jan 2, 2023, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.