ETV Bharat / state

మే 2 నుంచే దరఖాస్తులకు ఆహ్వానం.. వెబ్​సైట్​లో నిర్ధేశించిన ప్రకారమే..

Police Recruitment: పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో మొత్తం 17,291 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 25న 4 నోటిఫికేషన్లు, 28న మరో 2 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. మే 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు వెల్లడించారు. వెబ్​సైట్​లో నిర్ధేశించిన ప్రకారమే అభ్యర్థులు దరఖాస్తు చేయాలని సూచించారు.

సోమవారం నుంచే దరఖాస్తులకు ఆహ్వానం.. వెబ్​సైట్​లో నిర్ధేశించిన ప్రకారమే..

author img

By

Published : Apr 30, 2022, 6:55 PM IST

Police Recruitment: పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో 17291 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 25న 4 నోటిఫికేషన్లు, 28న మరో రెండు నోటిఫికేషన్లను పోలీస్ నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస్ రావు జారీ చేశారు. పోలీసు, ప్రత్యేక భద్రతా దళం, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, రవాణా, ఆబ్కారీ శాఖలలో పోస్టులను భర్తీ చేయనున్నారు. మొదట విడుదల చేసిన 4 నోటిఫికేషన్లలో 587 ఎస్సై ఉద్యోగాలు, 16027 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

పోలీసు రవాణా విభాగంలో 63, ఆబ్కారీ శాఖలో 614 పోస్టులను భర్తీ చేయడానికి మరో నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులన్నింటికీ వచ్చే నెల 2వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 10గంటలలోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసు నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస్ రావు తెలిపారు. పోలీస్ నియామక మండలి వెబ్​సైట్​లో నిర్ధేశించిన ప్రకారమే అభ్యర్థులు దరఖాస్తు చేయాలని అధికారులు సూచించారు. www.tslprb.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

భర్తీ ఇలా..

  • సివిల్ ఎస్సై పోస్టులు 541, సివిల్ కానిస్టేబుళ్లు 14,881 పోస్టులకు నోటిఫికేషన్
  • ఎస్పీఎఫ్ ఎస్సై 12, కానిస్టేబుల్ 390 పోస్టులు
  • అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 26 పోస్టులు, పైర్‌మెన్ 610 పోస్టులు
  • జైళ్లశాఖలో డిప్యూటీ వార్డర్ 8, వార్డర్లు 146 పోస్టులకు నోటిఫికేషన్
  • రవాణా విభాగంలో 63 కానిస్టేబుల్ పోస్టులు
  • ఆబ్కారీ శాఖలో 614 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.