జనతా కర్ఫ్యూలో భాగంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పలు వాహనాలను ఆపి.. కరోనా నివారణ కోసం ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించారు. అనవసరంగా బయట తిరగొద్దని ఆదేశించారు.
ఈ సందర్భంగా ద్విచక్ర వాహనం నడుపుతున్న ఓ మైనర్ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బండి సీజ్ చేసి, జ్యువైనల్ హోమ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: 'చైనా ఆ విషయాన్ని దాచినందుకే 'కరోనా' విజృంభణ'