ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం - Police Martyrs Day Latest News

Police Martyrs Day Celebrations In Telangana: పోలీసు అమరవీరుల దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు ప్రజాప్రతినిధులు, పోలీసులు ఘననివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలిపారు. హైదరాబాద్‌ గోషామహల్‌లో జరిగిన వేడుకల్లో హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, నివాళి అర్పించారు.

Police Martyrs Day is celebrated in telangana

author img

By

Published : Oct 21, 2022, 12:01 PM IST

Updated : Oct 21, 2022, 12:48 PM IST

Police Martyrs Day Celebrations In Telangana: శాంతిభద్రతలు బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని సంఘ విద్రోహశక్తుల కార్యకలాపాలు అరికట్టడంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. హైదరాబాద్‌ గోషామహల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రితో పాటు డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు అధికారులు అమరవీరులకు నివాళి అర్పించారు.

అమరవీరుల స్ఫూర్తితో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరరహిత సమాజ స్థాపనకు కృషి చేస్తామని ఈ సందర్భంగా డీజీపీ చెప్పారు. పౌరుల భద్రత కోసం పోలీస్​శాఖలో ఎన్నో సంస్కరణలో తీసుకువచ్చినట్లు హోంమంత్రి తెలిపారు. పోలీసులు రక్షించటంతోనే తాను ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నానని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. హనుమకొండ పోలీస్​ కమిషనరేట్‌లో జరిగిన పోలీస్ అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో సీపీ తరుణ్‌ జోషి, పోలీసు అధికారులతో కలిసి మంత్రి నివాళి అర్పించారు.

పోలీసుల త్యాగాలు గొప్పవని పేర్కొన్న ఎర్రబెల్లి వారి కుటుంబాలను గౌరవించుకోవడం అందరి విధిగా తెలిపారు. అనంతరం నగరంలో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డిలో ఎస్పీ రమణకుమార్, మెదక్‌లోని ఏఆర్​ హెడ్‌ క్వార్టర్స్‌లో జరిగిన పోలీస్‌ సంస్మరణ దినోత్సవంలో అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పాల్గొని నివాళి అర్పించారు.

ఆదిలాబాద్‌లో జరిగిన వేడుకల్లో అమరవీరుల కుటుంబాలతో కలిసి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీ ఉదయ్‌ కుమార్‌రెడ్డి పాల్గొని నివాళి అర్పించారు. ఖమ్మం పోలీసు పరేడ్‌ మైదానంలో అమరులకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతోనే రాష్ట్రంలో తీవ్రవాదాన్ని తుదముట్టించగలిగామని తెలిపారు.

"శాంతిభద్రతలు బాగా ఉంటేనే రాష్ట్రమైనా, దేశమైనా, ప్రపంచంలోని ఏ ప్రదేశమైనా అభివృద్ధి చెందుతుంది. తీవ్రవాదం, సంఘవిద్రోహక శక్తులు, పెరగకుండా పోలీసులు పనిచేస్తున్నారు. హైదరాబాద్​లో గత ఎనిమిది సంవత్సరాలుగా మతవిద్వేషాలు చెలరేగకుండా పోలీసులు అరికట్టారు." - మహమూద్‌ అలీ హోంమంత్రి

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

ఇవీ చదవండి: ఆ రూట్లో వెళ్తున్నారా.. డబ్బులతో వెళితే లెక్క చూపాల్సిందే!

చాయ్‌వాలాకు భాజపా ఎమ్మెల్యే టికెట్.. 4సార్లు గెలిచిన మంత్రిని పక్కనబెట్టి..

Last Updated : Oct 21, 2022, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.