తమపై శాఖపరమైన విచారణ నిలిపివేయాలని కోరుతూ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. జయరాం హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిందితులకు సహకరించారనే అభియోగాలపై సస్పెండయిన ఏసీపీ ఎస్.మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, రాంబాబు దాఖలు చేసిన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
నాంపల్లి కోర్టులో తమపై అభియోగపత్రం దాఖలయిందని.. కోర్టులో విచారణ ప్రక్రియ కొనసాగుతుండగా... అవే ఆరోపణలపై శాఖపరమైన విచారణ చేపట్టడం సరికాదని వాదించారు. శాఖపరమైన విచారణలో తమ వాదన బహిర్గతమైతే.. కోర్టు విచారణలో తమకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
అయితే నేరాభియోగాలపై కోర్టులో విచారణ... ఉద్యోగిగా దుష్ప్రవర్తన ఆరోపణలపై జరిగే శాఖా పరమైన విచారణ వేర్వేరని హైకోర్టు స్పష్టం చేసింది. ముగ్గురి పిటిషన్ను తోసిపుచ్చింది.
ఇదీ చూడండి:ఈ చెత్త నుంచి విముక్తి కలిగించరా...!