షాద్‌నగర్ దిశ అత్యాచారం, హత్య ఘటన పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీ, బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని జూపార్క్ సమీపంలో లారీల అడ్డ వద్ద డ్రైవర్లు, క్లీనర్లు, ఆటోడ్రైవర్లతో చార్మినార్ ఏసీపీ అంజయ్య సమావేశమయ్యారు.
తప్పుడు మార్గాల్లో వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. విధి నిర్వహణ సక్రమంగా కొనసాగిస్తూ... కుటుంబాలను పోషించుకోవాలన్నారు. లారీ అడ్డాల వద్ద ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తున్నట్లు గమనిస్తే.. వెంటనే అడ్డుకుని పోలీసులను అప్రమత్తం చేయాలని ఏసీపీ వివరించారు.
ఇవీచూడండి: 'దోషులకు ఉరి శిక్షతోనే 'దిశ'కు న్యాయం'