ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో నాటుసారా తయారీ, అక్రమ మద్యం రవాణాలపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని పుల్లూరు చెక్‌పోస్టు వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. పోలీసులను చూసి పరిగెత్తిన ఓ వ్యక్తిని వెంబడించి పట్టుకున్నారు. సదరు వ్యక్తి బ్యాగులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం బాటిళ్లు గుర్తించారు.
మరోవైపు మరికొందరు మాత్రం వాహనాలను ఆపకుండా పోలీసులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నాటు సారా అమ్మకందారులు, అక్రమ మద్యం రవాణా చేసే 25 మందిని పోలీసులు అరెస్టు చేయడంతో పాటు 5 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.
ఇవీ చూడండి:అసత్య ప్రచారాలు సరికాదు.. నేను ఆరోగ్యంగానే ఉన్నాను: పద్మాదేవేందర్ రెడ్డి