ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నెల రోజుల్లో 453 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

Police Checking in Telangana During Election Code : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఓటర్లకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తూ ఓటు ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.453 కోట్లకు పైగా నగదు, ఆభరణాలు, మద్యం, ఇతరాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య.. 41లక్షలకు పైగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.

Telangana Male Voters 2023
Telangana Total Voters 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 9:30 AM IST

Police Seize Money after Election Code రాష్ట్రవ్యాప్తంగా ఈసీ తనిఖీలు నెల రోజుల్లోపే రూ.453 కోట్లు విలువైన సొత్తు స్వాధీనం

Police Checking in Telangana During Election Code : గత శాసనసభ ఎన్నికలతో పోల్చితే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 41 లక్షలకు పైగా పెరిగింది. 2018 ఎన్నికల సమయంలో ఓటర్ల సంఖ్య 2,80,75,914.. ఈ నెల మూడో తేదీ వరకు పరిష్కరించిన దరఖాస్తుల ప్రకారం ఓటర్ల సంఖ్య 3,22,04,148కు చేరుకుంది. అక్టోబర్ నెలాఖరు వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తే ఈ సంఖ్య మరికాస్త పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో పురుష ఓటర్లు 1,60,97,014 మంది ఉండగా.. మహిళా ఓటర్లు(Telangana Female Voters) 1,60,89,156 మంది ఉన్నారు. థర్డ్‌ జెండర్ ఓటర్లు 2,583 మంది, సర్వీసు ఓటర్లు 15,395 మంది, ప్రవాస ఓటర్లు 2,859 మంది ఉన్నారు.

Telangana Voters Details 2023 : 2018 ఎన్నికల సమయంలో ప్రవాస ఓటర్ల సంఖ్య కేవలం 244 కాగా.. ఈసారి ఏకంగా 2,859గా నమోదైంది. సర్వీసు ఓటర్లు ఐదు వేలకు పైగా పెరిగారు. రాష్ట్రంలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య 9,10,810.. 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య 62,58,84గా ఉంది. 30 నుంచి 40 ఏళ్ల మధ్య 1,22,566 మంది.. 41 నుంచి 60 ఏళ్ల మధ్య 1,08,03,759 మంది ఓటర్లు ఉన్నారు. 60 ఏళ్లకు పైబడిన ఓటర్ల సంఖ్య 41,93,534గా ఉంది. అలాగే 80 ఏళ్లకు పైబడిన ఓటర్ల సంఖ్య 4,39,566గా.. ఓటర్ల జాబితాలో దివ్యాంగుల సంఖ్య 5,06,779 ఉంది.

ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ

2023 ఎన్నికల ఓటర్ల వివరాలు :

ఓటర్లు2018లో2023లో
మొత్తం ఓటర్ల సంఖ్య2,80,75,9143,22,04,148
పురుషులు 1,60,97,014
మహిళలు 1,60,89,156
థర్డ్‌ జెండర్ 2,583
సర్వీసు ఓటర్లు 15,395
ప్రవాస ఓటర్లు244 2,859
18 నుంచి 19 ఏళ్ల మధ్య 9,10,810
20 నుంచి 29 ఏళ్ల మధ్య 62,58,84
30 నుంచి 40 ఏళ్ల మధ్య 1,22,566
41 నుంచి 60 ఏళ్ల మధ్య 1,08,03,759
60 ఏళ్లకు పైబడిన వారు 41,93,534
80 ఏళ్లకు పైబడిన వారు 4,39,566
దివ్యాంగులు 5,06,779

Police Seize Liquor, Gold in Telangana : ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.453 కోట్లకు పైగా నగదు, ఆభరణాలు, మద్యం, ఇతరాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. గడచిన 24 గంటల్లో రూ.7.98 కోట్లు నగదు.. అక్టోబర్ తొమ్మిది నుంచి రూ.164.11 కోట్ల నగదు పట్టుబడినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.52.93 కోట్ల విలువైన మద్యం, 27.58 కోట్ల విలువైన డ్రగ్స్​ స్వాధీనం(Police Seized Drugs) చేసుకున్నారు.

ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి రూ.165.43 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, 43.86 కోట్లు విలువ గల ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గడచిన 24 గంటల్లో రూ.15.4 కోట్ల విలువైన.. నగదు, ఆభరణాలు, మద్యం, కానుకలను స్వాధీనం చేసుకోగా.. అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి ఈ మొత్తం విలువ రూ.453.93 కోట్లకు చేరుకుంది.

Telangana Voters List 2023 : ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించిన ఎన్నికల సంఘం.. మొత్తం ఓటర్లు 3.06 కోట్లు

Police Seizes Money During Election Code in Telangana : ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో పోలీసులు ప్రతిఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ని పోలీస్‌లు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు మంత్రి పోలీస్‌లకు పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను పోలీసులు పరిశీలించారు. ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్​ చౌహాన్ సూచించారు. నామినేషన్లతో పాటు క్షేత్రస్థాయిలో వివిధ పార్టీల ప్రచారాలున్న నేపథ్యంలో చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు.

చెక్‌పోస్ట్‌ల వద్ద పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయాలని.. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని కోరారు. ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున మద్యం నిలువలు ఉంచినా.. మద్యం అక్రమ విక్రయాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అంబర్​పేట్​లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. గోవా నుంచి రాష్ట్రానికి తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్‌ చేశారు.

Final Voter List Released in Telangana : 3,17,17,389 ఓటర్లతో తుది జాబితా రెడీ..

Huge Amount of Money Seized in Telangana : రాష్ట్రంలో ఎక్కడ చూసినా నోట్లకట్టలే.. ఇప్పటి వరకు రూ.168 కోట్లు సీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.