Police Caught Huge Hawala Cash in Hyderabad : రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు వాహనాలు, అధిక మొత్తంలో నగదును పట్టుకువెళ్లే వ్యక్తులపై నిఘా పెట్టారు. సోమవారం నుంచే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నగదును పట్టుకెళ్తున్న వ్యక్తులను, వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకొంటున్నారు.
Police Seized Money in Hyderabad : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పరిధిలోని నలుగురు వ్యక్తుల నుంచి భారీ హవాలా మనీ(Hawala Money)ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.3.35 కోట్ల నగదును బంజారాహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్(North Zone Task Force)తో కలిసి బంజారాహిల్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
కియా కారును తనిఖీ చేయగా..: ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 3 వద్ద వాహనాలు తనిఖీ చేశారు. పోలీసులకి అనుమానాస్పదంగా ఉన్న కియా కారును తనిఖీ చేశారు. కారులో రూ.3.35 కోట్ల నగదుని గుర్తించారు. ఈ మొత్తాన్ని హవాలా మనీగా నిర్ధారించుకుని.. డబ్బుతో పాటు నలుగురు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చింపిరెడ్డి హనుమంత రెడ్డి, బచ్చల ప్రభాకర్, మండల శ్రీరాముల రెడ్డి, ఉదయ్ కుమార్‌లుగా గుర్తించారు. ఇందులో ప్రధాన సూత్రధారి చింపిరెడ్డి అని తేలింది.
Huge Hawala Cash Case Details : ప్రధాన నిందితుడు సూచనల మేరకు మిగిలి ముగ్గురు నిందితులు హవాలా మనీ సేకరిస్తారని డీసీపీ తెలిపారు. ఈ గ్యాంగ్ వివిధ ప్రాంతాల్లో డబ్బులను తరలిస్తారని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని అరోరా కాలనీలోని సాయి కృప బిల్డింగ్‌లో ప్లాట్ నంబర్ 583ని తమ కార్యాలయంగా మార్చుకుని ఈ దందా నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
ఈ గ్యాంగ్ సేకరించిన హవాలా మనీని తమ కార్యాలయానికి తీసుకువెళ్తుండగా పట్టుకున్నారని.. ఆ ప్లాట్‌ని సీజ్ చేశారని తెలిపారు. వారు కోటి రూపాయలకి రూ.25,000 కమీషన్‌గా తీసుకుంటున్నారని గుర్తించారు. ఇవాళ ఉదయం ప్రభాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి కలిసి బేగం బజార్, గోషామహల్, నాంపల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రూ.3.35 కోట్లు సేకరించారని అన్నారు. పట్టుకున్న నగదు మొత్తాన్ని కోర్టులో సబ్మిట్ చేస్తారని డీసీపీ జోయల్ డెవిస్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాహన తనిఖీలు మరింత విస్తృతంగా చేస్తామని అన్నారు.
"ఇవాళ వాహనాలు తనిఖీ చేసినప్పుడు హవాల డబ్బును రూ.3.35 కోట్లు స్వాధీనం చేసుకున్నాం. ఈ డబ్బును తీసుకువెళ్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. వీళ్లు రోడ్ నంబర్ 3 అరోరా కాలనీలో ఒక కార్యాలయం నడుపుతున్నారు. బేగం బజార్, గోషామహల్, నాంపల్లి, జూబ్లీహిల్స్ వివిధ ప్రాంతాల నుంచి డబ్బులు సేకరించి.. వేరే వాళ్లకి ఇవ్వడం ఈ గ్యాంగ్ పని. ఈ క్రమంలోనే వారిని పట్టుకున్నాం. మరింత దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలుపుతాం." - జోయల్ డెవిస్, వెస్ట్ జోన్ డీసీపీ
Fake Notes Found In SBI : SBIలో నకిలీ నోట్ల కలకలం.. ఏకంగా RBIకే పంపిన బ్యాంకు అధికారులు
ఎన్నిక వేళ భారీగా పట్టుపడుతున్న హవాలా సొమ్ము.. మునుగోడుకే పోతోందా..?