ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఈ నెల 24న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి మారణాయుధాలతో ప్రవేశించారని కేసు నమోదైంది. పెద్దారెడ్డి కుమారుడు, అనుచరులపై కూడా కేసులు నమోదయ్యాయి.
న్యాయవాది శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంటిపై రాళ్లు రువ్విన ఘటనలో పెద్దారెడ్డి కుమారుడిపై కేసు నమోదవ్వగా.. జేసీ ప్రభాకర్ రెడ్డి కారును ఢీ కొట్టి హత్యాయత్నం చేశారని పెద్దారెడ్డి అనుచరులపై కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ సీఐ తేజోమూర్తి తెలిపారు.