ETV Bharat / state

Police Case on kodangal MLA Patnam Narender Reddy : కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డిపై కేసు నమోదు - భూ కొనుగోలు విషయంలో కొడంగల్‌ ఎమ్మెల్యేపై కేసు

Police Case Filed Against MLA Patnam Narender Reddy in Hyderabad : భూమి కొనుగోలు విషయంలో కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిపై కేసు నమోదైంది. ఇంద్రపాల్‌ అనే వ్యక్తికి భూమిని అమ్మడానికి రూ.3.65 కోట్లకు ఎమ్మెల్యే బేరం కుదుర్చుకున్నారు. ఆ డబ్బుల విషయంలో ఎమ్మెల్యే.. ఇంద్రపాల్‌ను బెదిరించాడు. దీంతో అతడు కోర్టును ఆశ్రయించడంతో.. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

MLA Patnam Narendra Reddy
MLA Patnam Narendra Reddy
author img

By

Published : Jun 11, 2023, 6:24 PM IST

Case Registered Against Kodangal MLA in Banjarahills PS : కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. భూమి కొనుగోలు విషయంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2018లో రాజేంద్రనగర్‌ ఉప్పరపల్లికి చెందిన బాధితుడు ఇంద్రపాల్‌ రెడి.. ఉప్పరపల్లిలోని స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో మధ్యవర్తుల రూపంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రాకేశ్‌రెడ్డిలు ఆయనకు పరిచయం అయ్యారు.

Kodangal MLA Narender Reddy Latest News : తమకు తెలిసిన భూస్వాములు ఉన్నారని.. వీరిద్దరూ కలిసి శ్రీరామ్​రెడ్డి అనే మరో వ్యక్తిని ఇంద్రాపాల్‌కు పరిచయం చేశారు. స్థలం, తమ కమీషన్‌తో కలిపి రూ.3.65 కోట్లకు భూమి అమ్ముతామన్నారు. ఇంద్రపాల్‌ ఇందుకు ఒప్పుకున్నాడు. ఈ మేరకు 2018 మే 24న రూ. 90 లక్షలు చెల్లించాడు. సెక్యూరిటీ కింద ఎమ్మెల్యే, రాకేశ్‌రెడ్డిలు బాధితుడి వద్ద బ్లాంక్ చెక్కులు తీసుకున్నారు. విడతల వారీగా మొత్తం రూ.3.05 కోట్లను భూ యజమానులకు, ఎమ్మెల్యే, రాకేశ్‌రెడ్డిలకు ఇంద్రపాల్ చెల్లించాడు. మరో రూ.60 లక్షలు లోన్‌ రాగానే చెల్లిస్తానని తెలిపాడు. రుణం మంజూరు కాకపోవడంతో.. డబ్బులు ఇచ్చేందుకు ఆలస్యం అయింది. దీంతో అప్పటి నుంచి తనను బెదిరిస్తున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

గతేడాది జూన్‌లో తన ఇంటికి వచ్చి భార్యను, తనను బెదిరించారని.. తనను గదిలో బంధించి తీవ్రంగా కొట్టారని ఇంద్రపాల్‌ పేర్కొన్నాడు. ఎమ్మెల్యే తన గన్‌మెన్‌ను పంపించి చంపేదుకు ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తప్పించుకుని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించకోలేదని.. ఆ తర్వాత హైదరాబాద్ సీపీని ఆశ్రయించానని తెలిపాడు. సీపీ.. కేసును పశ్చిమ మండల డీసీపీకి రిఫర్ చేసినా ఫలితం దక్కకపోవడంతో నేరుగా కోర్టును ఆశ్రయించినట్లు వివరించాడు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. ఎమ్మెల్యే సహా రాకేశ్‌రెడ్డి అనే వ్యక్తిపై సెక్షన్ 342, 384, 323, 506 రెడ్‌ విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన కేసు కొత్తగా ఏర్పాటైన ఫిలింనగర్ ఠాణా పరిధిలో ఉండటంతో.. కేసును బంజారాహిల్స్ పోలీసులు ఆ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.

Kodangal MLA Narendra Reddy Case : ఫిర్యాదులు చేస్తున్న సమయంలో కూడా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. అదనంగా మరో రూ.2.5 కోట్లు ఇవ్వాలని బెదిరించారని బాధితుడు ఫిర్యాదులో వివరించాడు. లేకుంటే బ్లాంక్ చెక్కులతో కోర్టుకు వెళ్తామని తనను బెదిరించారని చెప్పారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.