ETV Bharat / state

దంపతుల మధ్య గొడవ... భర్తను చితకబాదిన పోలీసులు - గొడవలో భర్తను చితకబాదిన పోలీసులు

భార్యాభర్తల మధ్య గొడవలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జోక్యం చేసుకోవడమే కాకుండా భర్తను పీఎస్‌కు తీసుకెళ్లి చితకబాదారు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లోని మోండామార్కెట్‌ పరిధిలో జరిగింది.

police attack on one person
దంపతుల గొడవలో భర్తను చితకబాదిన పోలీసులు
author img

By

Published : May 4, 2021, 4:43 PM IST

దంపతుల మధ్య జరిగిన గొడవలో పోలీసులు భర్తను చితకబాదారు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ పీఎస్‌ పరిధిలో జరిగింది. స్థానిక రామ్‌గోపాల్‌ పేట్‌లో నివాసముండే తుకారం నాయక్‌ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. బాబాయి అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక భార్యతో గొడవ జరిగింది.

ఈ క్రమంలోనే పోలీసులు జోక్యం చేసుకుని అతన్ని పీఎస్‌కు తీసుకెళ్లారు. అనంతరం అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారని బాధితుడు వాపోయారు. తన భార్య ఫిర్యాదు చేసిందని పోలీసులు చేయి చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా చేయి చేసుకున్నందుకు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఎవరివో తప్పుడు సలహాలు, నివేదిక వల్ల నాపై కక్ష సాధిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.