హైదరాబాద్‌కు చెందిన వెంకటేష్, వసీం, ఖాన్ ముగ్గురూ కలిసి ఆసిఫ్ నగర్, మంగళహాట్, రాయదుర్గం, లంగర్ హౌస్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై పార్కు చేసిన వాహనాలను నకిలీ తాళంతో తీసి దొంగిలిస్తారు. అనంతరం వాటిని కర్ణాటక తీసుకెళ్లి భాగాలను వేరు చేసి అమ్ముకుంటారు.
తరచూ వాహనాలు పోతున్నట్లు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన ఆసిఫ్ నగర్ పోలీసులు... సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏ1 నిందితుడైన వెంకటేష్ గతంలోనే రెండు కేసుల్లో శిక్ష అనుభవించాడని తెలిపారు.
ఇవీ చూడండి: బైరామల్‌గూడ పైవంతెనను ప్రారంభించిన కేటీఆర్