ETV Bharat / state

ఓయూలో 'నిరుద్యోగ మార్చ్'.. విద్యార్థి నాయకులు, కాంగ్రెస్​ నేతల అరెస్ట్

Students arrested in OU hostels: ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల సమస్యలపై తలపెట్టిన 'నిరుద్యోగ మార్చ్' నేపథ్యంలో విద్యార్థి నాయకులను పోలీసులు వసతి గృహల్లోకి వెళ్లి మరీ ముందస్తు అరెస్టులు చేశారు. వారిని ఓయూ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Police  arrested students
Police arrested students
author img

By

Published : Mar 24, 2023, 11:58 AM IST

Students arrested in OU hostels: అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ ఛైర్మన్ భీంరావు నాయక్ అన్నారు. 30 లక్షలకు పైగా నిరుద్యోగ యువత ఆవేదనపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు. టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ​కి మూల కారకులైన ఛైర్మన్, సభ్యులను వెంటనే తొలగించాలని డిమాండ్​ చేశారు.

మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల సమస్యలపై తలపెట్టిన 'నిరుద్యోగ మార్చ్' నేపథ్యంలో విద్యార్థి నాయకులను పోలీసులు వసతిగృహల్లోకి వెళ్లి మరీ ముందస్తు అరెస్టులు చేశారు. వారిని ఓయూ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

"పేపర్​ లీకేజీ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి. ఇందులో ఆరోపణలు వస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నించాలి. అన్యాయంగా ఓయూ హాస్టల్​కు వచ్చి మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు. అరెస్టులతో మమ్మల్ని భయపెట్టలేరు. రేపటి నుంచి అన్ని యూనివర్సిటీల్లో నిరసన కార్యక్రమాలు చేపడతాం".- విద్యార్థి సంఘాల నాయకులు

Revanth Reddy House arrested: మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాయం విద్యార్థి ఐకాస చేపట్టిన నిరుద్యోగ మార్చ్‌కు సంఘీభావంగా పాల్గొననున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ నేతలను గృహ నిర్బంధం చేశారు. రేవంత్‌ రెడ్డి సహా అద్దంకి దయాకర్, మల్లు రవి, పలువురు విద్యార్థి నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లో రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

రేవంత్ ఇంటికి వెళ్లే అన్ని దారుల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. తనిఖీ చేశాకే ఆ దారిలోకి అనుమతిస్తున్నారు. ప్రతిపక్షాలపై కేసీఆర్‌ సర్కారు ఉక్కుపాదం మోపుతోందని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. వరసగా రెండో రోజూ గృహ నిర్బంధం చేయడమేంటని నిలదీశారు. నిరుద్యోగులకు అండగా ఉంటామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని అద్దంకి దయాకర్‌ ప్రశ్నించారు.

"ప్రతిపక్షాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రెండో రోజు వరుసగా పోలీసులు హౌస్ అరెస్ట్​లు చేస్తున్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది. నిందితులను వదిలేసి.. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణలో అప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తోంది. ఒక వైపు కేంద్రం రాహుల్​గాంధీ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్​ నాయకులను మాట్లాడకుండా ప్రభుత్వం మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఇవాళ ప్రభుత్వం బాధితుల పక్కన ఉండాల్సింది పోయి.. నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తోంది. "-అద్దంకి దయాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి

ఓయూలో 'నిరుద్యోగ మార్చ్'.. పలువురు ముందస్తు అరెస్టులు

ఇవీ చదవండి:

విదేశాలను తాకిన పేపర్​ లీకేజీ కేసు.. త్వరలో మరిన్ని అరెస్టులు..!

'48 గంటల్లో తాజా టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ నివేదిక ఇవ్వండి'

'కేటీఆర్ వద్ద సంపూర్ణమైన సమాచారం ఉందని సిట్‌ అధికారికి చెప్పా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.