ETV Bharat / state

భూమి కోసమే పాస్టర్​ హత్య... కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్​లో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. భూవివాదమై ఓ పాస్టర్​ను కత్తులతో పొడిచి చంపారు. ఈ నెల 22 న జరిగిన ఘటనలోని ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మారణాయుధాలు, ద్విచక్రవాహనాలు, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

POLICE ARRESTED 5 ACCUSED IN PASTER MURDER IN MADHAPUR

author img

By

Published : Nov 29, 2019, 6:56 AM IST

Updated : Nov 29, 2019, 8:09 AM IST

ఈ నెల 22న హైదరాబాద్​ కొండాపూర్​లో జరిగిన పాస్టర్ సత్యనారాయణ రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సత్యనారాయణ రెడ్డి హత్యకు హఫీజ్​పేటలోని 300 గజాల స్థల వివాదమే కారణమని పోలీసులు వెల్లడించారు. తన స్థలాన్ని కబ్జా చేసేందుకు మహమ్మద్ జమిల్ ప్రయత్నిస్తున్నాడని పోలీసులకు సత్యనారాయణ రెడ్డి ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో కక్ష పెట్టుకున్న జమీల్... పాస్టర్​ను హత్య చేసేందుకు పన్నాగం పన్నారు.

స్థలం విషయమై మాట్లాడుదామంటూ... హఫీజ్​పేట్ కు పిలిపించుకొని కత్తులతో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడ్డ ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు వాడిన కత్తులు, రెండు ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.

భూమి కోసమే పాస్టర్​ హత్య... కేసును చేధించిన పోలీసులు

ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది

sample description
Last Updated : Nov 29, 2019, 8:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.