ETV Bharat / state

Food Adulteration In Hyderabad : కెమికల్స్​తో అల్లం వెల్లుల్లి పేస్ట్.. కాటేదాన్​లో కల్తీ దందా - Adulterated Food On Rise In Hyderabad

Food Adulteration In Hyderabad : కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు.. ఆహార పదార్థాలన్నింటిని కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు కల్తీ రాయుళ్లు. కాసులకు కక్కుర్తి పడి పండంటి జీవితాలను ఎండుటాకుల్లా మార్చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని తుంగలో తొక్కి కల్తీ పదార్థాలను తయారు చేస్తున్న ఇలాంటి ఓ ముఠా గుట్టురట్టు చేశారు సైబారాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు.

Food Adulteration In Hyderabad
Food Adulteration In Hyderabad
author img

By

Published : May 8, 2023, 12:16 PM IST

Food Adulteration In Hyderabad : సమాజంలో అక్రమ కల్తీ వ్యాపారాలు అధికమైపోయాయి. అనుమతులు లేకుండా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని ఇష్టారీతిన వ్యాపారాలు చేస్తున్నారు. హానికర పదార్థాలు తయారు చేసి ప్రజల ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా వ్యాపారాలు చేసుకుంటూ పదార్థాలను విక్రయిస్తున్నారు. కనీస శుభ్రత ప్రమాణాలు పాటించకుండా ఇష్టారీతిన తినే పదార్థాలను తయారు చేస్తున్నారు. ఎలాంటి టెస్టింగ్ లేని, కనీసం శుభ్రత కూడా లేని పదార్థాలను అనుమతులు లేకుండా విక్రయిస్తున్నారు. పదార్థాల్లో ముప్పు కలిగించే కెమికల్స్​ను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారు. వాటిని చూస్తేనే అసహ్యం కలిగే రీతిలో అక్రమార్కులు ఆహార పదార్థాల కల్తీకి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్​లో తాజాగా బయటపడింది.

పోలీసుల దాడి: కల్తీ పదార్థాలను తయారు చేస్తున్న కార్ఖానాపై సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు జరుపగా జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాటేదాన్‌ పారిశ్రామికవాడలోని ఉమ్మానీ ఫుడ్‌ కంపెనీ నకిలీ, కల్తీ పదార్థాలను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నట్లు సైబరాబాద్ కమిషనరేట్​కు సమాచారం వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే కమిషనర్ ఆదేశాల మేరకు మైలార్‌దేవుపల్లి, శంషాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు శనివారం రాత్రి కార్ఖానాపై దాడులు నిర్వహించారు. అక్కడ ప్రాణాలకు ముప్పు కలిగించే, అనారోగ్యకరమైన పదార్థాలతో తయారైన మ్యాంగో జూస్, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, ఫుడ్‌ మసాలాలను పోలీసులు గుర్తించారు. ఇవేగాక మరెన్నో ఆహర పదార్థాలను రసాయనాలు కలిపి ఇక్కడ తయారు చేస్తున్నట్లు తెలిపారు.

500 కిలోల కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లి పేస్టు: ఎసిటిక్ ఆమ్లం కలిపి తయారు చేసిన 500 కిలోల కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లి పేస్టును పోలీసులు గుర్తించారు. మ్యాంగో జ్యూస్​లో కూడా మామిడిని ఉపయోగించకుండా మామిడిరంగును పోలిన ఆమ్లాన్ని కలిపి జ్యూస్​ను తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. సుమారుగా ఐదు గంటల పాటు జరిగిన ఈ దాడిలో టన్నుల కొద్ది నకిలీ, హానికరమైన పదార్థాలను తయారు చేసినట్లు వెల్లడించారు. ఈ పరిశ్రమలో 25 పైగా తయారీ యంత్రాలున్నాయి. రాత్రికి రాత్రికే ఈ పరిశ్రమను పోలీసులు సీజ్ చేశారు.

పరిశ్రమను నడిపిస్తున్న పాతబస్తీకి చెందిన నిర్వాహకులు అజిత్‌, ఫిరోజ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాటేదాస్ పారిశ్రామిక వాడలో ఇలాంటి నకిలీ ఉత్పత్తులను పూర్తి స్థాయిలో అరికడతామని ఇన్​స్పెక్టర్ మధు స్పష్టం చేశారు. నకిలీల తయారీకి ఖాళీ గోదాములు, మూసి ఉన్న పరిశ్రమలను అద్దెకు ఇచ్చిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.