ETV Bharat / state

సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్​డౌన్​ అమలు - telangana latest news

సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు పోలీసులు లాక్​డౌన్​ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపై ఎవరూ కనిపించకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో.. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నారు. పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతినిస్తూ.. లేనివారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

మరింత కఠినంగా లాక్​డౌన్​ అమలు
మరింత కఠినంగా లాక్​డౌన్​ అమలు
author img

By

Published : May 22, 2021, 2:11 PM IST

Updated : May 22, 2021, 2:20 PM IST

రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్​డౌన్​ అమలు

లాక్​డౌన్‌ సడలింపు సమయం ముగిసిన వెంటనే నగరంలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఉదయం 10.10 గంటల వరకు ఎవ్వరూ రోడ్లపై ఉండకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీస్‌ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసి.. పాస్‌లు, మినహాయింపులు లేని వాహనాలను సీజ్‌ చేశారు. నాంపల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, బేగంపేట ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరును హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ స్వయంగా పరిశీలించారు.

గోషామహల్ కూడలి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను జప్తు చేస్తున్నారు. రవీంద్రభారతి వద్ద లాక్​డౌన్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. దిల్​సుఖ్​నగర్​లో వాహనాలు ఆపి.. తనిఖీలు చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్​ స్తంభించింది. ఎర్రగడ్డలో వాహన తనిఖీల్లో భాగంగా రైతుబజార్ నుంచి మూసాపేట వంతెన వరకు వాహనాలు నిలిచిపోయాయి. నకిలీ పాసులతో పట్టుబడ్డ వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

స్వల్ప ఉద్రిక్తత..

ఎంజే మార్కెట్ వద్ద 10 గంటల తర్వాత వాహనాల రద్దీ తగ్గకపోవడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో.. స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మల్కాజిగిరి, కుషాయిగూడ, కీసర పరిధిలో పాసులు ఉన్న వాహనాలకే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. మేడ్చల్​ జిల్లాలో పోలీసులు పెట్రోలింగ్​ నిర్వహిస్తూ.. చెక్​పోస్టుల వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు.

డీజీపీ పరిశీలన..

అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. ఉప్పల్, నాచారం, కుషాయిగూడ పరిధిలోని చెక్​పోస్ట్​లను సీపీ మహేశ్​ భగవత్ పరిశీలించారు. కేపీహెచ్​బీ జాతీయ రహదారిపై లాక్​డౌన్​ పరిస్థితిని డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. అల్లాపూర్, బోరబండ, మోతీనగర్ ప్రాంతాల్లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ పర్యటించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు జప్తు చేస్తామని హెచ్చరించారు.

జిల్లాల్లోనూ ముమ్మరంగా..

జిల్లాల్లోనూ ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లాలో లాక్​డౌన్​ అమలును కలెక్టర్​ గుగులోతు రవి, ఎస్పీ సింధూశర్మ పరిశీలించారు.

పెద్దపల్లి జిల్లా మంథనిలో పోలీసులు ప్రత్యేక వాహనాల్లో వీధుల్లో తిరుగుతూ ఎవరూ బయట తిరగొద్దని హెచ్చరించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ మైకు ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు లాఠీలతో గుణపాఠం చెబుతున్నారు. అన్ని కూడళ్లలో బారికేడ్లు వేస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘాను కఠినతరం చేశారు.

దుకాణాలు సీజ్..

సంగారెడ్డిలో సమయం దాటినా మూసివేయకపోవడంతో ఎస్పీ చంద్రశేఖర్​రెడ్డి దుకాణాలు సీజ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై 200కి పైగా ద్విచక్రవాహనాలు, 100కు పైగా కార్లను సీజ్ చేసి ఠాణాకు తరలించారు. సీజ్ చేసిన వాహనాలకు జరిమానా విధిస్తామని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'బ్లాక్ ఫంగస్​ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ముప్పు తక్కువ'

Last Updated : May 22, 2021, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.