Modi On Bansilalpet Stepwell: భన్సీలాల్‌పేట మెట్లబావిపై ప్రధాని ప్రశంసలు - మార్చి నెల మన్‌కీ బాత్
Modi On Bansilalpet Stepwell: భన్సీలాల్‌పేట మెట్లబావిపై ప్రధానిమోదీ తన 'మన్‌కీబాత్' కార్యక్రమంలో ప్రశంసలు కురిపించారు. మట్టి, చెత్తతో నిండిని చారిత్రక మెట్లబావికి పునర్ వైభవం తీసుకొచ్చారని కొనిడాయారు.
Modi On Bansilalpet Stepwell: సికింద్రాబాద్ భన్సీలాల్ పేటలోని మెట్లబావికి పునర్ వైభవం తీసుకొచ్చారని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. ప్రధాని తన 'మన్‌కీ బాత్' కార్యక్రమంలో మెట్లబావి గురించి ప్రస్తావించారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాలను కాపాడేందుకు విశేష కృషిచేస్తున్నారని కొనియాడారు. మట్టి, చెత్తతో నిండిని చారిత్రక మెట్లబావికి పునర్ వైభవం తీసుకొచ్చారన్నారు.
తమిళనాడుకు చెందిన అరుణ్.. భూగర్భ జలాల అభివృద్ధి కార్యక్రమం చేపట్టారని.. మహారాష్ట్రలో ఓ పురాతన మెట్లబావిని శుభ్రం చేశారని చెప్పారు. సమాజంలోని కొందరు వ్యక్తులు స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ వారి సేవలను ప్రధాని ప్రశంసించారు.
ఇదీచూడండి: 'లోకల్‌ను గ్లోబల్ చేద్దాం.. దేశం మీసం తిప్పుదాం!'