సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిత్యం 1.80 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. వీరికి వీడ్కోలు పలికేందుకు మరో 50 వేల మంది వరకు వస్తుంటారని దక్షిణ మధ్య రైల్వే రైల్వేశాఖ లెక్కలు వేసింది. ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కరోనా వైరస్ సునాయసంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడం వల్ల ఫ్లాట్ ఫాం టికెట్ ధర పెంచారు అధికారులు నిర్ణయించారు.
ప్రస్తుతం ఫ్లాట్ ఫారం టికెట్ ధర రూ.10 ఉంది. రూ.50కు పెంచితే వీడ్కోలు పలికేందుకు వచ్చే వారిని నిరోధించే అవకాశముంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 84 రైల్వే స్టేషన్లలో రూ.10 నుంచి రూ.50కి, మరో 499 రైల్వే స్టేషన్లలో రూ.10 నుంచి రూ.20 కి పెంచినట్లు అధికారులు వివరించారు. పెంచిన ధరలు ఈ రోజు తెల్లవారు నుంచి మార్చి 31 వరకు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: వైభవంగా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం