ETV Bharat / state

ఇకపై ఎంసెట్ ర్యాంకు ఆధారంగా బీఎస్సీ(హానర్స్) ప్రవేశాలు! - తెలంగాణ వార్తలు

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ (హానర్స్) కమ్యూనిటీ సైన్స్ ప్రవేశాలు ఇకపై ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఉంటాయని వర్సిటీ స్పష్టం చేసింది. ఇంటర్​ బోర్డుల ఫలితాలు రకరకాలుగా ఉండడం వల్ల ప్రవేశాలు క్లిష్టతరంగా మారాయని రిజిస్ట్రార్ తెలిపారు. మెరిట్ ఆధారంగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు 50:50 నిష్పత్తి ప్రాతిపదికన ప్రవేశాలు కల్పించాలని వర్సిటీ నిర్ణయించిందన్నారు.

pjtsau latest news, pjtsau bsc honours course
పీజేటీఎస్​ఏయూ బీఎస్సీ హానర్స్ కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ వ్యవసాయ యూనివర్సిటీ
author img

By

Published : Mar 26, 2021, 5:20 PM IST

తెలంగాణ ఎంసెట్‌-2021 ద్వారానే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ (హానర్స్) కమ్యూనిటీ సైన్స్ ప్రవేశాలు ఉంటాయని యూనివర్సిటీ వెల్లడించింది. ఇప్పటి వరకు బాలికలకు మాత్రమే అర్హత ఉండగా... ఇకపై బాలురకూ అర్హత కల్పించనుంది. బీఎస్సీ (హానర్స్) కమ్యూనిటీ సైన్సు కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు తప్పకుండా తెలంగాణ ఎంసెట్‌-21లో ర్యాంక్ పొందాల్సిందేనని స్పష్టం చేసింది. మెరిట్ ఆధారంగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు 50:50 నిష్పత్తి ప్రాతిపదికన ప్రవేశాలు కల్పించాలని వర్సిటీ నిర్ణయించింది.

మెరిట్ ఆధారంగా ప్రవేశాలు

నాలుగేళ్ల కాల వ్యవధి కలిగిన ఈ కోర్సును 5వ డీన్ల కమిటీ సూచనతో బీఎస్సీ (హానర్స్) కమ్యూనిటీ సైన్సుగా మార్చారు. గతంలో ఈ కోర్సును బీఎస్సీ హోం సైన్సుగా పిలిచేవారు. ఇటీవల కాలంలో ఈ కోర్సుకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రవేశానికి ఇంటర్మీడియట్, తత్సమాన కోర్సులోని ఆప్షనల్ సబ్జెక్టుల్లో పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్‌లో ర్యాంకు పొందిన అభ్యర్థులకు మాత్రమే అర్హత కల్పిస్తూ విశ్వవిద్యాలయం అకడమిక్‌ కౌన్సిల్ నిర్ణయించింది.

ఇకపై ఎంసెట్ ఫలితాలే ప్రామాణికం

ఇంటర్మీడియట్ కోర్సుల్లో వివిధ బోర్డులు, వివిధ రకాలుగా ఫలితాలు ప్రకటించడం, కొన్ని బోర్డులు మార్కులు, మరికొన్ని గ్రేడ్‌పాయింట్లు, ఇంకొన్ని శాతాలు ఇవ్వడం వల్ల ప్రవేశాల్లో అర్హత నిర్ణయించడం క్లిష్టతరంగా మారిందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎస్‌.సుధీర్‌కుమార్‌ అన్నారు. అందుకే ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు జరపాలని నిర్ణయించామని తెలిపారు. ర్యాంకు సాధించిన అభ్యర్థులు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంసెట్‌-21 ఫలితాలు వెలువడిన తర్వాత బీఎస్సీ (హానర్స్) కమ్యూనిటీ సైన్సు కోర్సు ప్రవేశాలకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేస్తుందని వివరించారు. ఆసక్తిగల విద్యార్థులు మరింత సమాచారం కోసం విశ్వవిద్యాలయం వైబ్‌సైట్‌లో చూడవచ్చని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.