ETV Bharat / state

పింక్ బుక్-ఇన్వెస్టర్స్ గైడ్ టు తెలంగాణ-2021 విడుదల చేసిన కేటీఆర్​ - కేటీఆర్ తాజా​ వార్తలు

తెలంగాణ పెట్టుబడులు, అవకాశాలు, ఇతర అంశాలతో సమగ్రంగా రూపొందించిన "పింక్ బుక్- ఇన్వెస్టర్స్ గైడ్ టు తెలంగాణ 2021" పుస్తకాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్​లో విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, సౌకర్యాలు, మౌలిక వసతులను తెలిపే ఈ పుస్తకం పెట్టుబడిదారుల భవిష్యత్ నిర్ణయాలకు ఉపయోగపడుతుందని కేటీఆర్ అన్నారు.

pink book inverter guide to telangana
పింక్ బుక్-ఇన్వెస్టర్స్ గైడ్ టూ తెలంగాణ-2021
author img

By

Published : Jul 27, 2021, 9:00 PM IST

తెలంగాణ పెట్టుబడులు, అవకాశాలు, ఇతర అంశాలతో సమగ్రంగా రూపొందించిన "పింక్ బుక్- ఇన్వెస్టర్స్ గైడ్ ట తెలంగాణ 2021" పుస్తకాన్ని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్​లోని ప్రగతి భవన్​లో ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, సౌకర్యాలు, మౌలిక వసతులను తెలిపే ఈ పుస్తకం పెట్టుబడిదారుల భవిష్యత్ నిర్ణయాలకు ఉపయోగపడుతుందని కేటీఆర్ అన్నారు. సులభతర వాణిజ్యంలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. పింక్ బుక్ రంగాల వారి ప్రభుత్వ విధానాలను తెలుపుతుందని.. సులభతర వాణిజ్యాన్ని పెంపొందించటంలో ఈ పుస్తకం ఉపయోగపడుతుందని అన్నారు.

ఈ పుస్తకం విడుదల సంబంధించిన ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్... పెట్టుబడిదారుల దృక్కోణంలో రాష్ట్రాన్ని ఈ పుస్తకం ఆవిష్కరిస్తుందని పేర్కొన్నారు. పుస్తకం పీడీఎఫ్​ లింక్​ ట్వీట్టర్​లో జత చేశారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

" పింక్ బుక్- ఇన్వెస్టర్స్ గైడ్ టు తెలంగాణ 2021 పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. పింక్​ బుక్​ పెట్టుబడిదారుల దృక్కోణాన్ని చూచిస్తోంది"

-కేటీఆర్​, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

ఇదీ చదవండి: Green India Challenge: ఫిలింసిటీలో మొక్కలు నాటిన అమితాబ్​, నాగార్జున

TRS: తెరాస ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.