ETV Bharat / state

ఆరుపదుల వయసులో సైకిల్​పై తీర్థయాత్ర

అరవై ఏళ్ల వయసులో ఎవరైనా ఆసరాగా వస్తే తీర్థయాత్రలకు వెళ్లాలని సహజంగా పెద్దవాళ్లు భావిస్తారు. కానీ ఈ పెద్దాయన మాత్రం ఒక్కడే ఎంచక్కా సైకిల్ తొక్కుతూ…45 రోజులుగా 750 కిలోమీటర్లు యాత్ర చేశారు. ఉడిపి, కొక్కి సుబ్రహ్మణ్యం, ధర్మస్థలం, గోకర్ణ, హంపీలను దర్శించి మంత్రాలయానికి శుక్రవారమే వచ్చారు. ఆ వివరాలేంటో చదివేద్దాం…

Pilgrimage on a bicycle in the sixties
ఆరుపదుల వయసులో సైకిల్​పై తీర్థయాత్ర
author img

By

Published : Sep 12, 2020, 2:22 PM IST

తమిళనాడు రాష్ట్రం తిరువళ్లికి చెందిన 60 ఏళ్ల గోపాలకృష్ణ అయ్యర్‌ ఆంజనేయస్వామి ఆలయం పూజారి. కరోనాతో ఆలయాలకు తాళం వేయడంతో సైకిల్‌పై యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. 45రోజులుగా 750 కిలోమీటర్లమేర సైకిల్‌ యాత్ర చేసి…ఉడిపి, కొక్కి సుబ్రహ్మణ్యం, ధర్మస్థలం, గోకర్ణ, హంపీ ప్రాంతాలను దర్శించి మంత్రాలయానికి శుక్రవారం వచ్చారు. రాఘవేంద్రస్వామిని దర్శించుకొని తిరిగి ప్రయాణం మొదలు పెట్టారు. అక్కడి నుంచి విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నట్లు చెప్పారు.

సైకిల్ తొక్కుతూ యాత్ర సరే మరి మిగతా అవసరాల మాటేంటి అంటే… పడుకోవడానికి దుప్పట్లు, దుస్తులు, వంటకోసం వంట సామగ్రి అదే సైకిల్‌పై ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. కనకదుర్గమ్మను దర్శించుకొని అటునుంచి ఇతర ఆలయాలకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఇంట్లో వారు యాత్రకు కావల్సిన సొమ్మును ఏటీఎంలో వేస్తే వాటితో సరకులు తీసుకొని తానే స్వయంగా వండుకుంటానని తెలిపారు. కరోనాతో లాక్‌డౌన్‌ ఉండడంతో ఆలయాల యాత్రను చేపట్టినట్లు వివరించారు..

ఇవీ చదవండి: భాగ్యనగరంలో వచ్చేస్తున్నాయ్​... సైకిల్​ ట్రాక్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.