ETV Bharat / state

అధికంగా వసూలు చేస్తున్నట్లు ఆధారాలు చూపండి: హైకోర్టు - ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలకు అధికంగా వసూలు

లాభాపేక్షతో కరోనా చికిత్సలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కరోనా చికిత్సలకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే ఎక్కువగా వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులేవో పేర్కొని.. వాటిని ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్నారనేందుకు ఆధారాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది.

అధికంగా వసూలు చేస్తున్నట్లు ఆధారాలు చూపండి: హైకోర్టు

author img

By

Published : Jul 1, 2020, 8:26 PM IST

కొవిడ్‌ చికిత్సల పేరిట ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయని పట్నం అనే స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి డి.జి. నరసింహారావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 50 శాతం బెడ్లను ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకుని ఆన్‌లైన్లో పారదర్శకంగా కేటాయించేలా ఆదేశాలివ్వాలని కోరారు.

పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. కార్పొరేట్ ఆస్పత్రులు రోజుకు రూ. 50వేల నుంచి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఏ ఆస్పత్రి కూడా ప్రభుత్వం నిర్దేశించిన రూ. 4 వేల నుంచి 9 వేలను తీసుకోవడం లేదని వివరించారు.

అయితే ఏయే ఆస్పత్రులు ఎక్కువగా వసూలు చేస్తున్నాయో ఆధారాలు చూపాలని హైకోర్టు అడిగింది. విచారణను జులై 10కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.