రాష్ట్ర బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.2వేల కోట్లు కేటాయించాలని డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ సంస్థ డిమాండ్ చేసింది. వికలాంగుల పరిరక్షణ చట్టం-2016లోని సెక్షన్ 92 గురించి అందరికీ అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని సంస్థ ప్రధాన కార్యదర్శి వి.భారతి కోరింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద దివ్యాంగులు ఒక రోజు నిరాహార దీక్ష చేశారు.
రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ సంస్థ ప్రధాన కార్యదర్శి వి.భారతి డిమాండ్ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగులు, వృద్ధులను వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగించాలని ఆమె విన్నవించారు. ఆదర్శ వివాహం చేసుకున్న దివ్యాంగ జంటలకు ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని కోరారు.
ఇదీ చదంవడి: కమ్యూనిస్టు పార్టీలకు లేఖలు రాసిన రాష్ట్ర కాంగ్రెస్