హైదరాబాద్ రవీంద్రభారతిలోని ఐసీసీఐ ఆర్ట్ గ్యాలరీలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణయాదవ్ సందర్శించి నిర్వహకులను అభినందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఉద్యమ పోరాటంతో పాటు బంగారు తెలంగాణ వంటి ఛాయాచిత్రాలు వీక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటో జర్నలిస్టు ఛాయాచిత్రాలను ఒకే వేదికపై ఏర్పాటు చేయడం అభినందనీయమని వీటిలో ఎంపికైన ఉత్తమ ఛాయాచిత్రాలకు బహుమతులు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి :దున్నపోతులపై పందెం కాసి రాక్షసానందం!