ETV Bharat / state

ప్రశాంతంగా పీజీ డిప్లొమా, డిగ్రీ పరీక్షలు ప్రారంభం - ప్రశాంతంగా పీజీ డిప్లొమా, డిగ్రీ పరీక్షలు ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ డిప్లొమా, డిగ్రీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్​ నియంత్రణలో భాగంగా.. అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లేముందు విద్యార్థులకు థర్మల్​ స్క్రీనింగ్​ నిర్వహించి శానిటైజ్​ చేశారు.

pg medical degree and diploma exams started in telangana state
ప్రశాంతంగా పీజీ డిప్లొమా, డిగ్రీ పరీక్షలు ప్రారంభం
author img

By

Published : Jun 20, 2020, 11:41 AM IST

ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ డిప్లొమా, డిగ్రీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరగనున్నాయి. పీజీ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 1,187 మంది డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. గాంధీ వైద్య కళాశాల కేంద్రాన్ని... కామినేని అకాడమీ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ ఎల్బీనగర్, సికింద్రాబాద్​కు తరలించారు.

కరోనా వైరస్​ నియంత్రణలో భాగంగా.. అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. వరంగల్​ కాకతీయ వైద్య కళాశాలలో పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లేముందు విద్యార్థులకు థర్మల్​ స్క్రీనింగ్​ నిర్వహించి శానిటైజ్​ చేశారు. విశాలమైన గదిలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా 25 నుంచి 30 మందికి మాత్రమే సీటింగ్​ ఏర్పాట్లు చేసినట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.