కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టానికి చేపడుతున్న సవరణలకు వ్యతిరేకంగా పీఎఫ్ఆర్ఐ ధర్నా చేపట్టింది. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు వారు ఆందోళన చేపట్టారు. సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకత పెంచడం కోసం సవరిస్తున్నామంటూ... సవరణ చట్టం ద్వారా ఏం సవరిస్తున్నారో పార్లమెంటుకు కూడా చెప్పకుండా దాచడమే... పారదర్శకత పెంచడమా అని వారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన సమాచార హక్కు చట్టాన్ని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం కొనసాగించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆమోదం తెలిపిన బిల్లును... రాష్ట్రపతి తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:లైవ్: తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం