ETV Bharat / state

petrol price: మరోసారి పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలు - పెట్రోలు ధరలు

చమురు ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ సామాన్యుడిపై భారం మోపుతున్నాయు. తాజాగా పెట్రోల్​పై 26 పైసలు, డీజిల్​ 27 పైసలు పెరిగింది.

petrol price: మరోసారి పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలు

author img

By

Published : Jun 9, 2021, 1:56 PM IST

బండి ముట్టాలంటే భయమేస్తోంది. ప్రయాణమంటే ధైర్యం రావడం లేదు. బస్సుల్లో అయితే కాస్త పర్వాలేదు కాని సొంత వాహనాల్లో ఊరేళ్లాలంటే ఆలోచించాల్సి వస్తోంది. ఊరేళ్లడమే కాదు బయటకు వాహనం తీయాలంటే సందేహించాల్సి వస్తోంది. ఎందుకంటే పెట్రోలు డీజిల్​ ధలను చూసి.. రోజురోజుకూ పెరిగిపోతున్న చమురు ధరలతో సామాన్య ప్రజానీకం భయపడిపోతున్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సాధారణ ప్రజలు ఉక్కిబిక్కిరి అవుతున్నారు. అయినా ధరలు తగ్గకపోగా ఇవాళ మరొకసారి పెరిగాయి. పెట్రోల్‌పై 26పైసలు, డీజిల్‌పై 27పైసలు లెక్కన చమురు సంస్థలు ధరలు పెంచాయి. కరోనాతో భయకంపితులైన ప్రజలపై రోజువారీ ధరల నిర్ణయం మాటున చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ పోతున్నాయి.

ఇవాల్టి పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్​ ధర రూ.99.32, డీజిల్‌ ధర రూ.94.26కి చేరింది. ఇప్పటికే రాష్ట్రంలోని 14 జిల్లాలల్లో, పలు పట్టణాల్లో లీటరు పెట్రోల్‌ ధర వంద మార్క్‌ను దాటింది. తాజాగా పెరిగిన ధరల ప్రకారం అదిలాబాద్​లో లీటరు పెట్రోల్​ ధర రూ.100.83, భద్రాద్రి కొత్తగూడెంలో రూ. 100.28, జగిత్యాలలో 100.24, జోగులాంబ గద్వాల్​లో రూ.101.37, కామారెడ్డిలో రూ.100.39, కుమురం భీం ఆసిఫాబాద్​వో రూ.101.37, మంచిర్యాలలో రూ.100.24, మహబూబ్‌నగర్​లో 100.27, నాగర్‌ కర్నూల్​లో 100.36, నిర్మల్​లో రూ.101.52, నిజామాబాద్​లో రూ.101.19, రాజన్న సిరిసిల్లలో 100.25, వికారాబాద్​లో రూ.100.25, వనపర్తిలో రూ.100.25గా ఉంది.

మరొకటి రెండు సార్లు పెట్రోల్‌ ధరలు పెరిగినట్లయితే రాష్ట్రంలోని సగం జిల్లాల్లో వంద మార్క్‌ను దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ పెట్రోల్‌ ధర వంద రూపాయిల మార్క్‌ను దాటింది.

ఇదీ చదవండి: Corona: చికిత్సనందిస్తూనే మృత్యుఒడికి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.