గురుకుల పాఠశాలల ప్రిన్సిపళ్ల నియామకాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అనర్హులను ఎంపిక చేశారని ఉన్నత న్యాయస్థానంలో అభ్యర్థులు అత్యవసర పిటిషన్ను దాఖలు చేశారు. తమకన్నా తక్కువ ప్రతిభ ఉన్న వారిని ఎంపిక చేశారని ఆరోపించారు.
టీఎస్పీఎస్సీ రోజుకో విధంగా వ్యవహరిస్తోందని న్యాయవాది రచనారెడ్డి వాదన వినిపించారు. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి, టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశించింది. నియామక ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉండాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి: రెవెన్యూ ట్రైబ‌్యునళ్లలో కేసులపై హైకోర్టులో విచారణ