ETV Bharat / state

హైదరాబాద్​ టూ దిల్లీకి సైక్లింగ్​.. వ్యాయామ ఉపాధ్యాయుడి రికార్డ్​ - telangana latest news

అతనో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు.. ఏదైనా సాధించి తన విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలనుకున్నాడు. ఆలోచనలను ఆచరణలో పెట్టి హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు 650 కిలోమీటర్లు జాగింగ్ చేసి రికార్డు సృష్టించాడు.. అదే సంకల్పంతో మరోసారి హైదరాబాద్ నుంచి దిల్లీకి సైక్లింగ్ చేసి మరోసారి రికార్డుల్లోకి ఎక్కేందుకు ఎదురుచూస్తున్నాడు.

pet cycling to delhi from hyderabadpet cycling to delhi from hyderabad
pet cycling to delhi from hyderabad
author img

By

Published : Dec 25, 2020, 10:47 AM IST

హైదరాబాద్​ టూ దిల్లీకి సైక్లింగ్​.. వ్యాయామ ఉపాధ్యాయుడి రికార్డ్​

చిన్న సైకిల్.. దాని వెనక జాతీయ పతాకంతో ముందుకెళ్తున్న యువకుని పేరు ఆనంద్ కుమార్ గౌడ్. హైదరాబాద్​లోని అల్వాల్​కు చెందిన 26 ఏళ్ల ఆనంద్... మేడ్చల్​లోని ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

ఆదర్శంగా నిలవాలని..

ఏదైనా సాధించి నలుగురికి ఆదర్శంగా నిలవాలనుకున్న ఆనంద్.. తన నిత్య కార్యకలాపాలతోనే రికార్డు సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. గతేడాది జనవరి 10న హైదరాబాద్ మెహదీపట్నం నుంచి తిరుపతి వరకు 650 కిలోమీటర్లు జాగింగ్​ చేశాడు. లాంగెస్ట్ జాగింగ్ విభాగంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సంపాదించాడు.

pet cycling to delhi from hyderabad
హైదరాబాద్​ టూ దిల్లీకి సైక్లింగ్​.. వ్యాయామ ఉపాధ్యాయుడి రికార్డ్​

రోజుకు 200 కిలోమీటర్ల సైక్లింగ్​!

తాజాగా హైదరాబాద్ నుంచి దిల్లీకి తక్కువ రోజుల్లో సైక్లింగ్ చేసి రికార్డు నెలకొల్పేందుకు సంకల్పించాడు. డిసెంబర్ 17న హైదరాబాద్ నుంచి సైకిల్ తొక్కుతూ దిల్లీ బయలుదేరాడు. రోజూ 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసినట్లు చెప్పాడు. తీవ్ర చలిగాలులు, పొగమంచు కప్పుకుని విజిబిలిటీ తగ్గినా తన సంకల్పంతో సైకిల్ ఫెడల్ ముందుకు కదిలినట్లు పేర్కొన్నాడు. మొత్తం 1550 కిలోమీటర్లు సైకిల్ తొక్కి ఏడు రోజులకు హస్తిన చేరుకున్నానని ఆనందం వ్యక్తం చేశాడు.

ప్రారంభంలోనే ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్​కు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపాడు. సైక్లింగ్ పూర్తైనట్లు వారికి సమాచారం ఇచ్చామన్నారు. త్వరలోనే ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు... ఈ యువ వ్యాయామ ఉపాధ్యాయుడు.

ఇవీచూడండి: తరతరాలకూ యాదికుండేలా... సర్వాంగ సుందరంగా యాదాద్రి క్షేత్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.