ETV Bharat / state

శ్రీవారి భక్తులకు శుభవార్త.. అందుబాటులోకి మెట్టు మార్గం.. - శ్రీవారి మెట్టు మార్గం వార్తలు

దాదాపు ఆరు నెలల తర్వాత శ్రీవారిమెట్టు కాలినడక మార్గం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శ్రీవారి మెట్టు వద్ద తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వహించి.. భక్తులను అనుమతించారు. గత ఏడాది నవంబర్​లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం భారీగా దెబ్బతింది.

SRIVARI METTU MARGAM NEWS
శ్రీవారి భక్తులకు శుభవార్త.. అందుబాటులోకి మెట్టు మార్గం..
author img

By

Published : May 5, 2022, 10:30 PM IST

తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడకమార్గం పున:ప్రారంభమైంది. శ్రీవారి మెట్టు వద్ద పూజలు నిర్వహించిన తి.తి.దే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.. ఆ తర్వాత జెండా ఊపి భక్తులను తిరుమలకు అనుమతించారు. శ్రీనివాస మంగాపురం నుంచి తిరుమలకు చేరుకునే కాలినడక మార్గమైన శ్రీవారి మెట్టు.. గత ఏడాది నవంబర్ 18, 19వ తేదీల్లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు మెట్టు మార్గంలో పెద్ద బండ‌రాళ్లు ప‌డి రోడ్డు, మెట్లు, ఫుట్‌పాత్‌లు, మ‌రుగుదొడ్లు దెబ్బతిన్నాయి. అధికారులు యుద్ధ ప్రాతిపాదిక‌న చర్యలు చేపట్టి.. న‌డ‌క మార్గాన్ని 3.60 కోట్ల రూపాయలతో మ‌ర‌మ్మతులు పూర్తి చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఈ మార్గం గుండా ప్రతి రోజూ ఆరు వేల మంది, ప్రత్యేక ప‌ర్వదినాల్లో 15 వేల మంది భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకుంటార‌ని తితిదే ఛైర్మన్ తెలిపారు. శ్రీ‌వారి మెట్టు మార్గంలోనే సాక్షాత్తు శ్రీ‌నివాసుడు తిరుమ‌ల‌కు చేరుకున్నట్లు, అలాగే శ్రీకృష్ణదేవ‌రాయలు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నట్లు శాస‌నాల ద్వారా తెలుస్తోంద‌ని ఆయన వివ‌రించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.