గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పలుచోట్ల తెరాస అభ్యర్థులకు నిరసన సెగ తగులుతోంది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్ డివిజన్ తెరాస అభ్యర్థి హేమలత జయరాం రెడ్డి ఎన్నికల ప్రచారంలో స్థానిక మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కూరగాయల మార్కెట్ ప్రాంతంలో ఆమె పాదయాత్రగా వచ్చిన సమయంలో.. స్థానికులు నిలదీసిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
గతంలో హేమలత జయరాం రెడ్డి భర్త వసూళ్ల వ్యవహారం ఆడియో వైరల్గా మారింది. ప్రస్తుతం డివిజన్లో ప్రచారం చేస్తున్న సమయంలో అనేక చోట్ల ప్రజలు ఆమెను నిలదీశారు. వరద సాయం తమకు అందలేదని అనేకసార్లు చెప్పినా స్పందించ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలాకాలంగా తన ప్రాంతానికి రాకుండా ఎన్నికల ముందు ఎందుకొచ్చారంటూ నిలదీస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇవీచూడండి: 'పొలిటికల్ టూరిస్టులతో ఒరిగేదేం లేదు... మేయర్ పీఠం తెరాసదే'