Kite Festival: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఇళ్ల ముందు రంగురంగు ముగ్గులు... రకరకాల పిండి వంటలు... ఆకర్షించే గాలిపటాలతో ప్రత్యేక శోభ సంతరించుకుంటుంది. సంక్రాంతికి పతంగులు ఎగరేవేయడం ప్రత్యేకత. ఈ పండుగ వచ్చిందంటే చాలు మార్కెట్‌లో విభిన్న రకాల గాలిపటాలు దర్శనమిస్తాయి. చిన్నపెద్దా తేడా లేకుండా అందరినీ ఆకట్టుకోవడంతో... పతంగులు ఎగురవేసేందుకు ప్రతిఒక్కరూ పోటీపడతారు. పండుగ ముంగిట గాలిపటాల దుకాణాలు... కొనుగోలుదారులతో సందడిగా మారాయి. ఏడాది కూడా పతంగుల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.
దుకాణాల వద్ద బారులు...
ప్రధానంగా ధూల్‌పేట్, గుల్జార్‌హౌజ్, చార్మినార్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని పతంగులు దుకాణాల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక రూపాయి నుంచి మొదలుకొని ఐదు వందల రూపాయల వరకు కూడా గాలిపటాలు లభిస్తున్నాయి. విభిన్న రకాల పతంగులు దుకాణదారులు విక్రయిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి కూడా కొనుగోలుదారులు నగరానికి వచ్చి గాలిపటాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడు కూడా ఉత్సాహంగా పతంగులు ఎగురవేస్తూ పండుగ జరుపుకుంటామని కొనుగోలుదారులు చెబుతున్నారు.
మరోవైపు గతంతో పోలిస్తే గాలిపటాల గిరాకీ తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. కరోనా ప్రభావంతో పాటు పెరిగిన ధరలు కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు.
ఇదీ చదవండి: